పాత రోజుల్లో తమకు నచ్చని హీరో సినిమా పోస్టర్లపై బురద, పేడ లాంటి వాటిని కొట్టేవారు మరో హీరో అభిమానులు. ప్రస్తుతం ఈ సోషల్‌ మీడియా యుగంలో డిస్‌-లైక్‌లు కొడుతున్నారు. అల్లు అర్జున్‌ సినిమా ‘దువ్వాడజగన్నాథమ్‌’కు విపరీతంగా డిస్‌-లైక్‌లు రావడం తెలిసిందే. ఇదంతా పవన్‌ ఫ్యాన్స్‌ పనే అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ‘కాటమరాయుడు’ వంతు వచ్చింది.

READ MORE: కాటమరాయుడు ట్రైలర్ 

ఇటీవలె విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు భారీ స్థాయిలో డిస్‌-లైక్‌లు వచ్చాయి. ఒకటిన్నర లక్షకు పైగా లైక్‌లు రాగా, దాదాపు 50 వేల డిస్‌-లైక్‌లు వచ్చాయి. కేవలం 24 గంటల్లోనే ఈ స్థాయి డిస్‌-లైక్‌లు రావడం చర్చనీయాంశం అయింది. అయితే ఇదంతా కేవలం బన్నీ ఫ్యాన్స్‌ పనే కాదని ఇండస్ర్టీ వర్గాల సమాచారం. తెలుగు సినీ పరిశ్రమలోని మరికొందరు టాప్‌ హీరోల అభిమానులు కూడా ఈ పనిలో పాలుపంచుకుంటున్నారట. కానీ, ఈ నింద మాత్రం బన్నీ పై పడుతోందని బన్నీ ఫ్యాన్స్‌ బాధపడుతున్నారట.

READ MORE: డీజె (దువ్వాడ జగన్నాథమ్) టీజర్

(Visited 333 times, 1 visits today)

Related Post