అభినులందరు ఎంతగానో ఎదురు చూస్తున్న కాటమరాయుడు ట్రైలర్ రానే వచ్చింది, ట్రైలర్ అద్దిరిపోయిందని టాక్, ట్రైలర్ తోనే సినిమాలో యాక్షన్ సీన్స్ బలంగా ఉన్నాయనిపిస్తోంది, యాక్షన్ సీన్స్ తోపాటు డైలాగ్స్, కామెడీ, రొమాన్స్ అన్నీ వున్నాయని క్లియర్ గా అర్ధమవుతోందీ…. యాక్షన్ తోపాటు కామెడీ, సెంటిమెంట్ కూడా పండితే సినిమా సూపర్ హిట్ అవడం ఖాయం. ఇక ట్రైలర్ రిలీజ్ అయినప్పటినుండి అభిమానులు పండగ చేసుకుంటున్నారు, ఎందుకంటే సర్ధార్ గబ్బర్ సింగ్ పరాజయం తర్వాత పవన్ కి సూపర్ హిట్ పడాలని అభిమానులు కోరుకుంటున్న టైంలో, ట్రైలర్ పై మంచి పాజిటివ్ టాక్ రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ట్రైలర్ కి ఇంత మంచి టాక్ వచ్చాక ఇక రివ్యూ ఇవ్వడానికి ఎం మిగలలేదు, కానీ ఈ ట్రైలర్ ని దీని తమిళ వెర్షన్ “వీరం” తో కంపేర్ చేసి ఏమేం మార్పులు చేశారు .. ? సినిమా ఎలా ఉండొచ్చు.. ? అని చిన్న అనాలిసిస్ చేద్దాం.

Katamarayudu Trailer Analysis || Pawan Kalyan

READ MORE: పవన్ కళ్యాణ్ పై మరోసారి వర్మ సెటైర్

ఇక ట్రైలర్ అనాలిసిస్ కి వెళ్లేముందు, దీని తమిళ వెర్షన్ “వీరం” గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే అజిత్ నటించిన ఈ సినిమా 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడి జనవరి 9, 2014 న రిలీజై వరల్డ్ వైడ్ గా 130 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. వీరం అంత పెద్ద హిట్ అవడానికి ప్రధాన కారణాలు నాలుగు, అవేంటంటే

1. అదిరిపోయే యాక్షన్ సీన్స్
2. సున్నితమైన కామెడీ
3. గుండెలకి హత్తుకునే లవ్ అండ్ సెంటిమెంట్ సీన్స్
4. ఫైనల్ గా అజిత్ యాక్షన్

ఇవన్నీ సమపాళ్లలో కలిశాయి కాబట్టే “వీరం” కి పోటీగా విజయ్ నటించిన “జిల్లా” అనే చిత్రం రిలీజ్ అయినా ఆ పోటీని తట్టుకుని అభిమానులని సంతోషపెట్టింది.

మరి వీరం కి రీమేక్ గా వస్తున్న “కాటమరాయుడు” ఆ మేరకు సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ప్రీరిలీజ్ ఫంక్షన్ లో అలీ చెప్పినట్లు వీరం కథలో కొన్ని మార్పులు చేసినట్లు కనబడుతోంది, అవేంటంటే

1. వీరం లో ఇద్దరు విల్లన్స్ వున్నారు ప్రదీప్ రావత్, అతుల్ కులకర్ణి. కాటమరాయుడు లో కూడా ప్రదీప్ రావత్, రావురమేష్ విల్లన్స్. అతుల్ కులకర్ణి పాత్రని రావురమేష్ పోషించారు. కానీ వీరం లో అతులకుల్కర్ణి పాత్ర క్లైమాక్స్ వరకు జైల్లోనే వుంటుది అండ్ ప్రదీప్ రావత్ అతులకుల్కర్ణి పాత్రలు ఎక్కడా కలవవు. కానీ కాటమరాయుడు లో మాత్రం ఆ రెండు పాత్రలు ట్రైలర్ లో చూపించినట్లు కలిసి కాటమరాయుడిపై పగ తీర్చుకునేలా మార్పులు చేసినట్లు కనబడుతోంది.

2. వీరం లో అజిత్ సినిమా ఫస్టాఫ్ మొత్తం గడ్డంతో కనిపిస్తాడు, సెకండ్ ఆఫ్ మొత్తం గడ్డం లేకండా కనబడతాడు, కానీ ట్రైలర్ ప్రకారం కాటమరాయుడు లో మాత్రం పవన్ క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నారు

3. అజిత్ సినిమా మొత్తం తెల్ల చొక్కా తెల్ల పంచెలోనే కనతారు, కానీ కామరాయుడు లో పవన్ మాత్రం కొన్ని సీన్స్ లో పంచెకట్టులో వున్నా కొన్ని సీన్స్ లో మాత్రం చొక్కా ప్యాంటు తో కనిపిస్తున్నారు

4. ఇవి మాత్రమే కాక కొన్ని ఎక్స్ట్రా గా యాడ్ చేసిన సీన్స్ కూడా ట్రైలర్ లో కనిపిస్తున్నాయి కానీ అవి కథలో ఎక్కడ ఎందుకు వస్తాయో ఊహించడం కష్టం.

5. ఇక మిగిలిన కథలో కీలకమైన ట్రైన్ ఫైట్ సీన్, చిన్న పిల్లని చంపడానికి రౌడీలు ప్రయత్నించడం, హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్, కాటంరాయుడి తమ్ముళ్ల లవ్ ట్రాక్, నాజర్ సీక్వెన్స్ లు మాత్రం మార్చకుండా అలాగే ఉంచినట్లు ట్రైలర్ చుస్తే అర్ధమవుతుంది.

అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఇప్పటికే అభిమానుల మన్ననలు పొందగా, మిగిలిన సెంటిమెంట్, కామెడీ, లవ్ సీన్స్ ఎంతవరకు మెప్పించగలవు అనే విషయంపై సినిమా సక్సెస్ ఆధారపడి వుంది.

కాటమరాయుడు సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సెలవు

 

READ MORE: కాటమరాయుడు ట్రైలర్

(Visited 600 times, 1 visits today)

Related Post