Click for: Katamarayudu Review in English 

విడుదల తేదీ: మార్చ్ 24, 2017

దర్శకత్వం: డాలీ 

నటీనటులు:  పవన్‌ కల్యాణ్‌, శ్రుతిహాసన్‌, నాజర్‌, అలీ, రావు రమేష్‌, ప్రదీప్‌ రావత్‌, తరుణ్‌ అరోరా, శివ బాలాజీ

నిర్మాత:  శరత్‌ మరార్‌

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. సర్దార్ సినిమా పరాజయం తర్వాత పవన్ పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పవన్ కల్యాణ్, శృతిహాసన్ జంటగా నటించిన ‘కాటమరాయుడు’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సినిమా ‘వీరం’ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు కిషోర్ కుమార్ పార్దసాని (డాలీ) దర్శకత్వం వహించారు. పవన్ కల్యాణ్ పంచెకట్టులో కొత్త లుక్‌తో వచ్చిన ‘కాటమరాయుడు’ తో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:

“కాటమరాయుడు” రాయలసీమలో బలమైన నాయకుడు. పైకి చాలా గంభీరంగా కనిపించే కాటమరాయుడి మనసు వెన్న, కష్టపడి నలుగురు తమ్ముళ్లను పెంచి పెద్దచేస్తాడు. ఆ వూళ్ళో అందరికి సాయం చేస్తూ కృతజ్ఞత ఆశించని వ్యక్తి కాటమరాయుడు. పెళ్లి చేసుకుంటే వచ్చే భార్య తనని తన తమ్ముళ్ల దగ్గరనుండి వేరు చేస్తుందని పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. అలా సాగిపోతున్న కాటమరాయుడి జీవితంలోకి అవంతి(శృతిహాసన్) వస్తుంది, ఆ తర్వాత ఏమైంది, కాటమరాయుడి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అన్నదే మిగిలిన కథ.   

ఎలా ఉందంటే..?:

అందరిని ముందుండి నడిపించే నాయకుడిగా, ప్రేమలో పడిన ప్రియుడిగా, తమ్ముళ్ల కి అన్నగా విభిన్న పార్శ్వాలున్న క్యారక్టర్ లో పవన్ తనదైన శైలిలో నటించి మెప్పించారు. తమిళ వెర్షన్ “వీరం” కి రీమేక్ గా వచ్చినప్పటికీ, డైరెక్టర్ డాలీ కథలో, కేరక్టర్స్ లో చాలా మార్పులు, చేర్పులు చేశారు. ఎన్ని మార్పులు చేసినా మూల కథని మాత్రం మార్చలేదు. కొన్ని కొన్ని సీన్స్ కేవలం అభిమానులను సంతోషపెట్టడానికి మాత్రమే తీసినట్లు అనిపించింది. ఈ చిత్రాన్ని తమిళ వెర్షన్ “వీరం” తో కంపేర్ చేస్తూ చూస్తే మాత్రం కొంత నిరుత్సాహ పడే అవకాశం వుంది.

సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్, కామెడీ, యాక్షన్ తో సరదా సరదాగా నడిచిపోతుంది, ట్రైన్ ఫైట్ తో వచ్చే ఇంటర్వెల్ సీన్ ని ఇంకొంచెం గొప్పగా తీసుంటే బాగుండేది అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ లో కామెడీ పాళ్లు కొంచెం తగ్గి సీరియస్ డ్రామా, యాక్షన్ సీన్స్ ఎక్కువవుతాయి, అయినా ఎక్కడా ప్రేక్షకుడికి విసుగనిపించదు, కానీ ఇంటర్వెల్ లో వచ్చే ఫైట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు దర్శకుడు డాలి కి సినిమాపై పట్టు తప్పినట్లు అనిపిస్తుంది, ఇలా అనిపించడానికి ప్రధానకారణం కాటమరాయుడికి అవంతి ఫ్యామిలీ కి మధ్య సెంటిమెంట్ పండకపోవడమే.

యాక్టర్స్ అందరు తమ పెర్ఫార్మన్స్ తో సినిమాకి బలాన్నిచ్చారు. మొత్తంమీద “కాటమరాయుడు” పవన్ కళ్యాణ్ ని ఇష్టపడే ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా.

సాంకేతిక వర్గం పని తీరు…?:

మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణ విలువలు గొప్పగా వున్నాయి.

బలాలు:

పవన్ కళ్యాణ్
కామెడీ
మ్యూజిక్
యాక్షన్

బలహీనతలు:

రొటీన్ గా సాగే సెకండ్ హాఫ్ 

రేటింగ్: 3/5

Related Post

Comments

comments