పవన్‌కు ఎన్ని ఫ్లాపులొచ్చినా.. ఆ ఎఫెక్ట్ అతని తదుపరి సినిమాపై మాత్రం పడదు. అందుకు ఉదాహరణలు ఎన్నోఉన్నాయి. తాజాగా.. కాటమరాయుడు విషయంలో రుజువైంది. గత ఏడాది విడుదలైన సర్దార్ గబ్బర్‌సింగ్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైనా.. దాని ప్రభావం మాత్రం కాటమరాయుడుపై పడలేదు. ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే దాదాపు నాన్ బాహుబలి రికార్డులన్నిటినీ ఈ సినిమా బద్దలు కొట్టింది.

పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేయాలి

తాజాగా కాటమరాయుడు దెబ్బకు మరో పది సినిమాలు వాషవుట్ అయ్యే సూచనలున్నాయట. ప్రస్తుతం పరీక్షల సీజన్ కావడం.. పెద్ద హీరోల సినిమాలేవీ లేకపోవడంతో థియేటర్ల వద్ద సందడిగా కాస్తంత పలుచగానే ఉంది. కాటమరాయుడు సినిమా మార్చి 24న విడుదల కాబోతోంది. ప్రస్తుతం థియేటర్లలో దాదాపు ఓ పది చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు నడుస్తున్నాయి.

మరోసారి విడుదల కానున్న బాహుబలి

మరో వారంలో కాటమరాయుడు రిలీజ్ అవబోతోంది కాబట్టి.. దాదాపు 90 శాతం థియేటర్లలో కాటమరాయుడు సినిమానే ఉండేలా చూస్తున్నారట. దీంతో ప్రస్తుతం ఉన్న ఆ పది సినిమాలు తీసేస్తారని సినీ విశ్లేషకులు చెప్పుతున్నారు. దీంతో కాటమరాయుడు సినిమా ఓపెనింగ్స్ భారీగానే ఉంటాయని సినీ విశ్లేషకులు చెప్పుతున్నారు.

Related Post

Comments

comments