పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా ప్రమోషన్ విషయంలో కొంత క్లారిటీ వచ్చింది. ఈ నెల 4 నుంచి పబ్లిసిటీ వేగం పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఆ రోజు నుంచి మూడు రోజులకో పాట చొప్పున ఆన్ లైన్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

మిగిలిన రెండు పాటల షూటింగ్ నిమిత్తం టీం 4న యూరప్ బయలుదేరి వెళ్లనుంది. తిరిగి వచ్చిన తరువాత.., మార్చి 18న భారీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజున థియట్రికల్ ట్రైలర్ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్.

పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ (కిశోర్ పార్థసాని) దర్శకుడు. ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తుండగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. వీలైనంత త్వరగా నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసి ఉగాది కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

(Visited 867 times, 1 visits today)

Related Post