ఒకనాటి హీరోయిన్ రాధ కూతురు కార్తీక హీరోయిన్ గా మెప్పించేందుకు గట్టి ప్రయత్నాలే చేసింది. జోష్.. రంగం.. దమ్ము వంటి సినమాలలో నటించిన కార్తీకకు ఇప్పుడు అనుకోని అవకాశం వచ్చిపడింది. అదే అమరేంద్ర బాహుబలి భార్య దేవసేనగా నటించే అవకాశం రావడం.

READ MORE: సమంతకు వడదెబ్బ.. చరణ్ సినిమా షూటింగ్ వాయిదా…!

అదేంటీ దేవసేన అంటే అనుష్క కదా అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. సిల్వర్ స్క్రీన్ పై దేవసేన స్వీటీ అయితే.. స్మాల్ స్క్రీన్ పై దేవసేనగా కార్తీక నటిస్తోంది. బాహుబలికి వచ్చిన క్రేజ్ ను బేస్ చేసుకుని అనేక ప్లాట్ ఫామ్స్ పై ఇది కంటిన్యూ కానుంది. బాహుబలి థీమ్ తో సీరియల్స్ తీస్తామని ఇప్పటికే రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పాడు కూడా. ‘ఆరంభ్’ అంటూ ఇప్పుడు హిందీలో ఓ సీరియల్ రూపొందనుండగా.. ఇందులో దేవసేన పాత్రను లీడ్ చేసుకుని కథ నడపనున్నారు. అంటే కుంతల రాజ్య యువరాణిగా దేవసేన రాజ్యం చేయడానికి వెనక ఉన్న కథ అన్నమాట.

(Visited 292 times, 1 visits today)

Related Post