కరణ్ జోహార్ తన క్రిమినల్ మైండ్‌ను బయటపెట్టాడు. ఈ మాట అంటున్నది మరెవరో కాదు.. స్వయంగా కరణ్ జోహార్ నోటి వెంట వచ్చిన మాటే. బాహుబలి సినిమాను హెచ్‌డీ ప్రింట్‌లో పైరసీ చేస్తూ ఆరుగురు దుండగులు పట్టుబడిన సంగతి తెలిసిందే. డబ్బు ఇస్తే తప్ప ఆ పైరసీ వీడియోను అప్పగించబోమని వారు హిందీలో సినిమాను విడుదల చేసిన కరణ్ జోహార్‌ను బెదిరించి కటకటాలు లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వారు పోలీసులకు చిక్కడంలో ప్రధాన పాత్ర కరణ్‌దేనట. ఓ మాస్టర్ ప్లాన్ వేసి వారు పోలీసులకు దొరికేలా చేశాడట.

REDA MORE: ‘బాహుబలి 2’ 19 డేస్ కలెక్షన్స్

దీనిపై స్పందించిన కరణ్ జోహార్.. మొట్టమొదటి సారిగా ఓ భారతీయ సినిమా హాలీవుడ్ మార్కెట్‌ను తలదన్నేలా రికార్డ్స్ క్రియేట్ చేస్తోందని, అలాంటి సినిమాను పైరేట్ చేయకుండా ఉంటే మరెన్నో రికార్డులు క్రియేట్ చేస్తుందని అన్నాడు. వేరే సినిమాలను పైరసీ చేసి ఉంటే తాను ఇంతలా పట్టించుకునేవాడిని కాదని, బాహుబలిని పైరసీ చేయడం కరెక్ట్ కాదని, అది నేరంలా భావించి తన క్రిమినల్ మైండ్ ద్వారా దుండగులను పోలీసులకు పట్టించానని కరణ్ జోహార్ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

(Visited 305 times, 1 visits today)

Related Post