విశ్వరూపం సినిమాతో ఓ వివాదానికి తెరతీసిన కమల్ హాసన్.. ఇప్పుడు మహాభారతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ తమిళ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహాభారతంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ‘‘మహాకావ్యంగా భావించే ఆ మహా గ్రంథంలో ఓ మహిళ అన్యాయానికి గురైంది. పాంచాలిని జూదంలో పావులా వాడుకున్నారు. అయినా సరే.. ఓ మహిళను పావులా వాడుకున్న ఆ గ్రంథాన్నే భారత్ ఇంకా గౌరవిస్తూనే ఉంది. ఎందుకు?’’ అని వ్యాఖ్యానించాడు.

“మెట్రో” మూవీ రివ్యూ మరియు రేటింగ్

ఈ వ్యాఖ్యలపై తమిళనాడులోని హిందూ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ.. తమిళ హిందూ సంస్థ మక్కల్ కచ్చి (హెచ్ఎంకే) నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. హెచ్ఎంకే రాష్ట్ర కార్యదర్శి రమా రవికుమార్ దీనిపై స్పందించారు. హిందూ వ్యతిరేకి అయిన కమల్ హాసన్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను భంగపరిచాయని అన్నారు.

‘‘కమల్ అనవసరంగా మహాభారతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఇది తగదు. ఇదే విధంగా ఖురాన్, బైబిల్ గురించి మాట్లాడగలరా? వేరే ఇతర మతం గురించి మాట్లాడే దమ్ము కమల్‌కు లేదు. విశ్వరూపం సినిమా సమయంలో ఆ సినిమాకు వ్యతిరేకంగా ముస్లింలు పోరాడారు. ముస్లింలను చెడుగా చూపించారంటూ సినిమా విడుదలపై పోరాటం చేశారు. దానికి గానూ ఆయన.. ఈ రాష్ట్రంలో భద్రత కరువైందని, వేరే ఎక్కడికైనా వెళ్లి బతుకుతానని అన్నారు. ఏ ఇతర మతం గురించి మాట్లేడే దమ్ము ఆయనకు లేదు. ఆయనో హిందూ వ్యతిరేకి. భారతం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్‌పై మేం పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఎప్పట్నుంచో ఆయన వ్యాఖ్యలతో మేం బాధపడుతున్నాం. అయినా సరే.. మేమేం నోరు మెదపలేదు. ఇక, చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశాం’’ అని రవికుమార్ చెప్పారు.

మరోవైపు, కమల్ వ్యాఖ్యలపై చెన్నై సహా కోయంబత్తూర్, ఈరోడ్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. హెచ్ఎంకే సంస్థ ఒక్కటే కాకుండా అఖిల హిందూ మహాసభ కూడా కోయంబత్తూర్‌లో కమల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కమల్ ఫొటోలను చించేశారు. కమల్ హాసన్ దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని స్టేషన్‌కు తరలించారు. 

మా అబ్బాయి” మూవీ రివ్యూ మరియు రేటింగ్

Comments

comments