జూనియర్ ఎన్టీఆర్‌ను ‘నవ భారత్ నేషనల్ పార్టీ’కి ఏపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నామంటూ ఓ లేఖ నెట్‌లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘జైలవకుశ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్.. ఈ విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకుని ఓ చిరునవ్వు నవ్వేశాడట. తాను ఇటువంటి వార్తలను పట్టించుకోబోనని వారికి చెప్పాడట. అంతేగాకుండా ఎవరూ ఈ వార్తలను పట్టించుకోవద్దని, వదిలేయాలని సూచించాడట.

READ MORE: కొత్తగా ఆలోచిస్తున్న పవన్…!

ఒకవేళ అలాంటి ఉద్దేశమే ఉంటే తానే స్వయంగా బహిరంగ ప్రకటన చేస్తానని అతడిని కలిసిన అభిమానులకు వివరించాడట. వేరే పార్టీని ఆధారంగా చేసుకుని రహస్యంగా రాజకీయాల్లోకి వచ్చే అవసరం తనకు లేదని వారితో కామెంట్ చేశాడట. మొత్తానికి తనపై వస్తున్న రాజకీయ ప్రచారానికి అభిమానులతో తారక్ ఇలా చెక్ పెట్టాడని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్.

READ MORE: కొత్త రికార్డు నీ క్రీయేట్ చేసిన సంపూ…!

Related Post

Comments

comments