యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘జై లవ కుశ’ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్లు కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యాయి. మొదట సినిమాలో ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రల యొక్క లుక్స్ ను ఒకే పోస్టర్లో రిలీజ్ చేస్తారని అనుకోగా టీమ్ మాత్రం కేవలం ఒక పాత్ర లుక్ ను మాత్రమే బయటకు వదిలింది. దీంతో మూడు పాత్రల్లో ఇది ఏ పాత్ర లుక్ అయ్యుంటుందో అనే ఆలోచనలో పడ్డారు.

READ MORE: కేశవ మూవీ రివ్యూ మరియు రేటింగ్ | 

పైగా పోస్టర్లో ఎన్టీఆర్ సంకెళ్లతో, వెనుక సింబాలిక్ గా రావణాసురుడి విగ్రహం ఉండటం చూస్తే ఈ పాత్రకు ఏమైనా నెగెటివ్ షేడ్స్ ఉంటాయా అనే థాట్ కూడా వస్తోంది. ఒక పాత్ర గెటపే ఇలా ఉంటే మిగతా రెండు పాత్రల గెటప్స్ ఎలా ఉంటాయో, ఎప్పుడు వస్తాయో అనే ఆతురత కూడా కలుగుతోంది. మొత్తం మీద ఎన్టీఆర్ తన మొదటి లుక్ తో అభిమానుల అంచనాల్ని చాలా వరకు అందుకున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Image result for jai lava kusa

(Visited 119 times, 1 visits today)

Related Post