ఇది మా ప్రేమకథ అంటున్న యాంకర్ రవి. తెలుగు బుల్లితెర స్టార్స్ ఈ మధ్య వెండితెరపై తమ టాలెంట్ చూపిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కోవలో చాలామంది సక్సెస్ కాగా, ఇప్పుడు ఈ లిస్టులోకి యాంకర్ రవి కూడా వచ్చేయడం విశేషం. ప్రస్తుతం బుల్లితెరపై తనకంటూ కొంత క్రేజ్ తో యాంకర్ గా సత్తా చాటుతున్న రవి.. అతి త్వరలోనే వెండితెరపై హీరోగా కనిపించనున్నాడు. ఈ మేరకు మత్స్య క్రియేషన్స్ పతాకంపై అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న ‘ఇది మా ప్రేమకథ’ అనే సినిమాలో యాంకర్ రవి హీరోగా నటిస్తున్నాడు.

ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న రవికి జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రానికి సంబంధించి హీరో రవి ఫస్ట్ లుక్ ను త్వరలనే ఓ సినీ ప్రముఖుడి చేతుల మీదుగా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయనున్నారని సమాచారం. అలాగే కార్తీక్ కొడకండ్ల సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే, ఈ సినిమాకు ‘ఇది మా ప్రేమకథ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయడంతో పాటు ‘1>99’ (1 ఈజ్ గ్రేటర్ దేన్ 99) అనే ట్యాగ్ లైన్ ను కూడా యాడ్ చేశారు. మరి బుల్లితెరపై యాంకర్ రవిగా బాగానే ఫేమస్ అయిన రవి.. వెండితెరపై హీరో రవిగా ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

(Visited 121 times, 1 visits today)

Related Post