ఇప్పటికే ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలతో విజయాలు అందుకున్న కాంబినేషన్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల ది. ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కనుంది. వచ్చే నెల మూడో తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్‌ పట్టాలెక్కబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు వంద కోట్ల బడ్జెట్‌ అవుతుందని త్రివిక్రమ్‌ అంచనా వేస్తున్నాడట.

READ MORE: కాటమరాయుడు దెబ్బకు 10 సినిమాలు వాషౌట్!

ఆ మేరకు విషయాన్ని నిర్మాత రాధాకృష్ణకు చెప్పాడట. అంతేకాదు ఈ సినిమా థియేట్రికల్‌, శాటిలైట్‌ రైట్స్‌ ద్వారా 120 కోట్ల రూపాయలు సంపాదిస్తుందని త్రివిక్రమ్‌ అనుకుంటున్నాడట. ఒకవేళ బ్లాక్‌బస్టర్‌ అయితే అంతకుమించి రాబట్టగలదని అంచనా వేస్తున్నాడట. రెగ్యులర్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అయిన ఈ సినిమాకు వంద కోట్ల బడ్జెట్‌ అవసరమవడానికి కారణం యాక్షన్‌ సన్నివేశాలట.

READ MORE: కాటమరాయుడు మూవీ టీజర్

తెలుగు అభిమానులకు యాక్షన్‌ సన్నివేశాల్లో ఓ కొత్త అనుభవం అందించేందుకు హాలీవుడ్‌ టెక్నీషియన్లను తీసుకుంటున్నారట. కేవలం యాక్షన్‌ సీక్వెన్సెన్‌ కోసమే పాతిక కోట్లు ఖర్చవుతున్నట్టు వినికిడి. ఏదేమైనా పవన్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌కు వంద కోట్ల రూపాయలు రాబట్టగలిగే సత్తా ఉందనేది అందరికి తెలిసిన విషయమే.

(Visited 883 times, 1 visits today)

Related Post