బాహుబలి ప్రాజెక్ట్ నుండి ఇప్పడే బయటపడ్డ ప్రభాస్ విరామం లేకుండానే కొత్త సినిమా మొదలుపెట్టేస్తున్నాడు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే కొత్త సినిమా ఫస్ట్ లుక్ రెడీ అయింది. ఈ ఆదివారమే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ కూడా సిద్ధమౌతోంది.

READ MORE: అక్కడ బాహుబలి చిత్రం పై ముదురుతున్న వివాదం…!

దాదాపు 150కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ప్రభాస్-సుజీత్ సినిమా రాబోతోంది. యాక్షన్ ఎడ్వెంచరస్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో కేవలం ఒక్క యాక్షన్‌ ఎపిసోడ్ కే రూ.35 కోట్లతో తెరకెక్కించబోతున్నట్టు తెలిసింది. హాలీవుడ్‌కి చెందిన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘సాహో’ అనే పేరు ప్రచారంలో ఉంది. ఈ నెల 28న విడుదలయ్యే ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ కొత్త టీజర్‌ విడుదల చేసేలా ఏర్పాట్లు చేశారు.

READ MORE: ‘ఖైదీ నెం 150’ 100 రోజుల పండుగ

(Visited 421 times, 1 visits today)

Related Post