తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ. రెండేళ్ల క్రితం జరిగిన ‘మా’ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించి మరింత పాపులర్‌ అయింది. తాజాగా ఓ వెబ్‌మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన హేమ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు సినీ పరిశ్రమపై కొంతమంది హీరోయిన్లు చేసిన విమర్శల గురించి, పూరీ జగన్నాథ్‌ గురించి, సోషల్‌ మీడియా గురించి ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

“తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు వాళ్లకు అవకాశాలు దక్కడం లేదు. పూరీ జగన్నాథ్‌ ఎక్కడో ఉన్న వాళ్లను తీసుకువచ్చి తన సినిమాల్లో అవకాశాలు ఇస్తాడు. ఇక్కడి వాళ్లనెందుకు తీసుకోడు. నాకెందుకు మదర్‌ క్యారెక్టర్స్‌ ఇవ్వడు. ఎన్టీయార్‌కు తల్లిగా కనిపించే స్టేచర్‌ నాకు లేదా? నాకు సినీ పరిశ్రమలో 25 ఏళ్ల అనుభవం ఉంది. ఏదైనా చెప్పే అర్హత, హక్కు నాకుంది.

ఇక, ఇటీవల కొంతమంది హీరోయిన్లు తెలుగు సినీ పరిశ్రమపై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు చేసిన వారు గత సినిమాల పేర్లు చెప్పుకునే బతుకుతున్నారు. ఇప్పుడు అవకాశాలు రాలేనంత మాత్రన విమర్శలు చేయడం సరికాదు. నిజంగా ఇండస్ర్టీ ఇంత చెడ్డదైతే.. హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ పిల్లలను ఎందుకు తీసుకువస్తున్నారు?” అని ప్రశ్నించింది. ఇక, సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత చాలా అనర్థాలు జరుగుతున్నాయని ఆరోపించింది.

Related Post

Comments

comments