Guru Telugu Movie Review and Rating

 

For Guru English Review Click here

విడుదల తేదీ: మార్చ్ 31, 2017

దర్శకత్వం: సుధ కొంగర ప్రసాద్

నటీనటులు: వెంకటేష్ , రితిక సింగ్ 

నిర్మాత: శశికాంత్ 

సంగీతం: సంతోష్ నారాయణన్ 

తమిళంలో ‘ఇరుది సుట్రూ’ పేరుతో, హిందీలో ‘సాలాఖడూస్’ పేరుతో మాధవన్ హీరో గా ఒకేసారి రిలీజ్ అయిన సినిమా కి రీమేక్ గా తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరో గా తెరకెక్కిన చిత్రం ‘గురు’. ఒరిజినల్ వర్షన్ ను తెరకెక్కించిన సుధ కొంగర దర్శకత్వంలోనే తెలుగులోనూ వెంకటేష్ హీరోగా తెరకెక్కించారు. తమిళ, హిందీ భాషల్లో నటించిన చాలా మంది నటులు తెలుగులోనూ అదే పాత్రల్లో కనిపించారు. చాలా సంవత్సరాల తరువాత వెంకటేష్ చేసిన ఈ సీరియస్ రోల్ అభిమానులను ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం

కథ:

కోపం, ఆవేశం, బాక్సింగ్ అంటే విపరీతమైన ప్రేమ వున్న ఆదిత్య (వెంకటేష్) ఇండియన్ ఉమెన్స్ బాక్సింగ్ ఫెడరేషన్ లో కోచ్ గా పనిచేస్తుంటాడు, కానీ అక్కడ జరిగే రాజకీయాలకి విరక్తి చెండుతాడు. ఆ ఫెడరేషన్ కి హెడ్ కోచ్ దేవ్ ఖత్రే ఆదిత్య మీద వున్న పాత పగతో అతనిని వైజాగ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అలా వైజాగ్ చేరిన ఆదిత్య జీవితం ఎలా మలుపులు తిరిగింది ? ఉమెన్ బాక్సింగ్ కి ఎలాంటి ఫెసిలిటీస్ లేని వైజాగ్ నుండి ఇంటర్నేషనల్ ఛాంపియన్ ని ఎలా తయారు చేశాడు అన్నదే మిగిలిన కథ.

READ MORE: డోర మూవీ రివ్యూ మరియు రేటింగ్

ఎలా ఉందంటే..?:

చాలా సంవత్సరాల తర్వాత వెంకటేష్ ఒక ఫుల్ లెంగ్త్ సీరియస్ రోల్ లో కనిపించారు. ఈ సినిమాలో ఫిమేల్ బాక్సర్ రోల్ కోసం డైరెక్టర్ సుధా కొంగర నిజమైన కిక్ బాక్సర్ “రితిక సింగ్” ని ఎంచుకున్నారు. తమిళ్, హిందీ వెర్షన్ లలో కూడా ఆ పాత్రని రితిక సింగ్ యే పోషించారు. ఒరిజినల్ వెర్షన్ లో తన నటనకి రోతిక సింగ్ నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఒరిజినల్ వెర్షన్ లో రితిక కొన్ని కొన్ని సీన్స్ లో మాధవన్ ని కూడా డామినెటే చేసి నటించారు, కానీ తెలుగు లో మాత్రం వెంకటేష్ నటన, అనుభవం తో తన పాత్రని హైలైట్ అయ్యేలా చేశారు. తన పాత్రకి వంద శాతం న్యాయం చేసి, సినిమా కి పెద్ద అసెట్ అయ్యారు విక్టరీ వెంకటేష్.

కొన్ని కొన్ని సీన్స్ లో తమిళ నేటివిటీ కనిపించినా, అన్ని సీన్స్ లో ఎమోషన్ చక్కగా క్యారీ అవడంతో నేటివిటీ ఎక్కడా సినిమాకి మైనస్ కాలేదు. తెలుగు వెర్షన్ కోసం చిన్న చిన్న మార్పులు చేసారు సుధా కొంగర, అలా మార్పులు చేయడం కూడా సినిమా కి ప్లస్ అయింది. సెంటిమెంట్, క్లైమాక్స్ సీన్స్ ఒరిజినల్ వెర్షన్ కన్నా చక్కగా పండాయంటేనే అర్ధం చేసుకోవచ్చు వెంకటేష్, రితిక ఎంత చిక్కగా నటించారో. డైరెక్టర్ సుధా కొంగర తమిళ్, హిందీ వెర్షన్ లతో పాటు తెలుగులో కూడా విజయాన్ని ఖాయం చేసుకున్నారు. ఇక సపోర్టింగ్ రోల్స్ లో నాజర్, తనికెళ్ళ భరణి తమ పాత్రలకి న్యాయం చేశారు. ఇది సీరియస్ మూవీ కావడంతో కామెడీ, రొమాన్స్, పంచ్ డైలాగ్స్ ని ఆశించే ప్రేక్షకులకి ఇవి మైనస్ గా అనిపించొచ్చు.

READ MORE: రోగ్‌ మూవీ రివ్యూ మరియు రేటింగ్

సాంకేతిక వర్గం పని తీరు…?:

సాంగ్స్, బాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సంతోష్ నారాయణన్ ఆకట్టుకున్నారు. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సినిమాకి అదనపు బలాన్నిచ్చాయి.

బలాలు: 
వెంకటేష్
రితిక
డైరెక్షన్
మ్యూజిక్

బలహీనతలు:

కామెడీ, రొమాన్స్, పంచ్ డైలాగ్స్ ఎక్కువగా ఇష్టపడే ప్రేక్షకులకు ఇది నచ్చకపోవచ్చు

రేటింగ్: 3.25/5

 

For Guru English Review Click here

Related Post

Comments

comments