హార‌ర్ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ లో బాగా కొన‌సాగుతొంది. ఈ జోన‌ర్‌లో ఫ్లాపులు వ‌ర‌స‌బెడుతున్నా, ఈ త‌ర‌హా సినిమాలు త‌యార‌వుతూనే ఉన్నాయి. ఫ్యామిలీ హీరో సినిమాలు చేసుకొనే శ్రీ‌కాంత్ `రా.. రా` అంటూ హార‌ర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు రాశీ కూడా.. సై అంటోంది. రాశీ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ హార‌ర్ సినిమా రూపుదిద్దుకొంది. దాని పేరు `లంక‌`. ఈ చిత్రం ఫస్ట్ లుక్స్ ఈ రోజే రిలీజ్ చేశారు. రెండు రకాల సీరియస్ లుక్స్ ను.. కంబైన్ చేసి డిఫరెంట్ గా రూపొందించిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి శ్రీ‌ముని ద‌ర్శ‌కుడు. దినేష్ న‌మ‌న‌, విష్ణు కుమార్ న‌మ‌న నిర్మాత‌లు. ఈ చిత్రం దాదాపుగా పూర్త‌యింది.

త్వ‌ర‌లోనే ప‌బ్లిసిటీకి శ్రీ‌కారం చుట్ట‌బోతోంది `లంక‌` టీమ్. ‘నిజం’లో వ్యాంపు త‌ర‌హా పాత్ర పోషించిన త‌ర‌వాత సినిమాల‌కు పూర్తిగా దూర‌మైంది రాశీ. మ‌ధ్య‌లో కొన్ని టీవీ షోలు చేసినా.. పెద్దగా ఆదరణ రాలేదు. మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి మ‌క్కువ చూపిస్తోంది…కానీ ఒకవేళ వచ్చిన త‌న‌కు ఆంటీ, అత్త పాత్ర‌లే దొరుకుతాయి. అయితే.. ‘లంక‌’సినిమాలో దాదాపు హీరోయిన్ స్థాయి పాత్ర ద‌క్కింది. త‌నే మెయిన్ లీడ్‌. హార‌ర్ సినిమాల్లో లంక ఓ కొత్త ప్ర‌య‌త్న‌మ‌ని, చంద్ర‌ముఖిలో జ్యోతిక‌కు ఎంత పేరొచ్చిందో, ఈ సినిమాలో రాశీకి అంత పేరొస్తుంద‌ని చిత్ర‌బృందం ధీమాగా చెబుతోంది.

(Visited 67 times, 1 visits today)

Related Post