Dora Telugu Movie Review and Rating

Click here for Dora English Review

 

విడుదల తేదీ: మార్చ్ 24, 2017

దర్శకత్వం: డోస్ రామస్వామి 

నటీనటులు:  నయనతార, తంబి రామయ్య 

నిర్మాత:  సర్కునం, హితేష్ ఝాబాక్ 

సంగీతం: వివేక్ శివ, మెర్విన్ సోలమన్ 

 

కథ:

పారిజాతం (నయనతార ) కాల్ టాక్సీ  మొదలుపెట్టాలని పాతకాలపు కారును కొంటుంది. కానీ కారులో కుక్క(డోరా )ఆత్మ ఉందని తెలుసుకొని షాకవుతుంది. ఇదే సమయంలో సిటీలో డబ్బు  కోసం గురుతెలియని వాళ్ళు  హత్య  చేస్తుంటారు . అసలు  ఆ కుక్క (డోరా) ఆత్మ నయనతార కారులోకి ఎందుకు వచ్చింది ? ఎలా వచ్చింది ? అసలు కారుకి నయనతారకి డోరాకి ఏమిటి సంబంధం ? సిటీలో జరిగే హత్యలకు వీళ్లకు సంబంధం ఏమిటన్నది  తెరమీద చూడాల్సిందే.

ఎలా ఉందంటే..?:

సినిమాలో ప్రధాన ఆకర్షణ నయనతార అనడంలో  ఎలాంటి సందేహం లేదు. నయనతార  అభినయం సినిమాకి   హైలైట్  గా  నిలుస్తుంది. కధకు తగ్గట్టుగా నయనతారా  నటన  సినిమాని  నిలబెడుతుంది. థిల్లర్  కదాంశానికి హర్రర్ ను కూడా జోడించడంతో ఆశక్తిని రేకెత్తిస్తాడు దర్శకుడు. ఇంటర్వెల్ దగ్గర నుంచి కధనం వేగం పుంజుకుంటుంది. ద్వితీయార్థం ఆసాంతం ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేయడం లో సఫలమయ్యాడు దర్శకుడు రామస్వామి. ఎక్కడ లాజిక్ మిస్సవని దర్శకుడు కొన్ని అనవసరమైన సీన్స్ ఎడిటింగ్ చేస్తే బాగుటుంది అనిపిస్తుంది. 

సినిమా ప్రథమార్థం  కామెడీ తో నడిపించాలనుకున్న దర్శకుడు  కొన్ని అనవసరమైన కామెడీ సీన్స్  పెట్టి  కాలక్షేపం చేస్తున్నాడు అన్పించే సమయంలో ఇంటర్వెల్ దగ్గరకాని అసలు కధలోకి  వెళ్ళడు. నయనతార తన తండ్రి  మధ్య నడిచే కోమెడీ ఏమంత ఆకట్టుకునేలాగలేదు. ఇన్వెస్టిగేటివ్ పోలీస్  ఆఫీసర్ హరీష్ ఉత్తమన్  నయనతార మధ్య  వచ్చే  సీన్స్  ఆకట్టుకుంటాయి. పోలీస్ ఆఫీసర్ గా హరీష్ ఉత్తమన్ నటన బాగానే ఉంటుంది. 

సాంకేతిక వర్గం పని తీరు…?:

నేపధ్యసంగీతం చాలా బాగుంది. నిర్మాణ విలువలు కధకి  సరిపడా బాగానేవున్నాయి. ఎడిటింగ్  కెమెరాపనితనం కుడా  బాగున్నాయి. డోరా సాంగ్ వినటానికి చూడటానికి చాలాబాగుంది.

బలాలు:

  • నయనతార నటన
  • స్క్రీన్ ప్లే
  • నేపధ్యసంగీతం
  • సెకండ్ హాఫ్
  • సినిమాటోగ్రఫీ 

బలహీనతలు:

  • ఫస్ట్ హాఫ్
  • కామెడీ

   థిల్లర్  సినిమా ప్రేక్షకులను మాత్రం బాగానే మెప్పిస్తుంది  .. .. డోరా 

రేటింగ్: 2.75/5

 

Click here for Dora English Review

Related Post

Comments

comments