వరుస హిట్లతో మంచి స్పీడ్ మీద ఉన్న బన్నీ తాజా చిత్రం డీజే.. దువ్వాడ జగన్నాధం..ఫిబ్రవరి 18న ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని డీజే యూనిట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి.. ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ లోనే ఉంది. చెప్పినట్లుగానే ఇప్పుడు ఫస్ట్ లుక్ ఇచ్చేశాడు దర్శకుడు హరీష్ శంకర్.

DJ Duvvada Jagannadham Official First Look Motion Teaser :Allu Arjun | Pooja Hegde | Harish Shankar || DSP

అల్లు అర్జున్ ను ఇప్పటివరకూ ఎన్నడూ చూడని విభిన్నమైన స్టైల్ లో.. ఈ డీజే ఫస్ట్ లుక్ పోస్టర్లో ప్రెజెంట్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. ఓ పాత బజాజ్ స్కూటర్.. దానికి వెనక పక్కనా మొత్తం అంతా ఆకు కూరలు..కూరగాయలు అరటి గెలలు తీసుకెళుతున్న అల్లు అర్జున్ ఈ పోస్టర్ లో కనిపిస్తారు. అయితే.. ముందు నుంచి అనుకున్నట్లుగానే.. తొలిసారిగా ఈ చిత్రంలో పూర్తి సాంప్రదాయ బ్రాహ్మణుడి పాత్రలో బన్నీ కనిపించబోతున్నాడని చెప్పేశాడు దర్శకుడు.

బ్యాక్ గ్రౌండ్ లో కనబడే థీమ్ కూడా ఈ కంప్లీట్ బ్రాహ్మిన్ నేటివిటీని కన్ఫాం చేస్తోంది. మరోవైపు ఏపీ16 అనే కృష్ణా జిల్లా రిజిస్ట్రేషన్ ఉన్న పాత బజాజ్ స్కూటర్ ని బన్నీ నడుపుతాడు. మొత్తానికి ఫస్ట్ లుక్ తోనే తమ సినిమా స్టైల్ ఏంటో.. స్టోరీ ఎలా ఉండబోతుందో.. సింపుల్ గా చెప్పేశారు అల్లు అర్జున్ అండ్ దర్శకుడు హరీష్ శంకర్.

(Visited 638 times, 1 visits today)

Related Post