కాటమరాయుడు టీజర్ విడుదలైనప్పటినుండి రికార్డులన్నీ బద్దలు కొట్టుకుంటూ యూట్యూబ్‌లో ఫాస్టెస్ట్.. హైయెస్ట్ టీజర్ గా రికార్డు క్రీయేట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. కాగా మరో గొప్ప రికార్డు ని కాటమరాయుడు తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. అదేమిటంటే ప్రస్తుతం కాటమరాయుడు టీజర్ వ్యూస్ 95.6 లక్షలు. ఇంకో 4 లక్షల వ్యూస్ వస్తే కోటి మార్కును టచ్ చేసేస్తుంది. మరోవైపు ఈ టీజర్‌కు రికార్డు స్థాయిలో 2.43 లక్షల లైక్స్ రావడం విశేషం. డిజ్ లైక్స్ 38 వేలుగా ఉన్నాయి.

మరోవైపు ‘కాటమరాయుడు’ టీజర్ తర్వాత వచ్చిన బన్నీ ‘దువ్వాడ జగన్నాథం’ టీజర్ కూడా యూట్యూబ్‌ లో ఇదే స్థాయిలో మోత మోగిస్తోంది. ప్రస్తుతం దీని వ్యూస్ 83 లక్షల దగ్గర ఉంది. బన్నీ కి ఉన్న క్రేజ్ కి ఈ టీజర్ కోటి మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదు. మరోవైపు ఈ టీజర్‌కు 1.6 లక్షల లైక్స్ వస్తే.. డిజ్ లైక్స్ 1.5 లక్షలుగా ఉండటం విశేషం. ఇప్పటిదాకా ఏ ఒక్క సౌత్ ఇండియన్ సినిమా టీజర్ కి ఇన్ని డిజ్ లైక్స్ రాలేదు…ఇదంతా పవన్ కళ్యాణ్ అభిమానుల ఘనత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చూద్దాం ఈ రెండు టీజర్లు ఇంకా ఎన్ని రికార్డ్స్ ని బద్దలుకొడతాయో మరి.

(Visited 244 times, 1 visits today)

Related Post