ఖైదీ నం 150 తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ చిరు, ఇప్పుడు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బుల్లితెర షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కి హోస్ట్ గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కింగ్ నాగార్జున 3 సీజన్స్ నుంచి సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్న ఈ షో, 4 వ సీజన్ ఫిబ్రవరి 13 నుండి మా టీవీ లో ప్రసారం కానుంది. చిరు ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాతో బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టి, అదే జోరుతో 151వ సినిమా కూడా మొదలు పెడుతున్నారు. రీ ఎంట్రీలో కూడా తనకెదురు లేదని నిరూపించుకున్నాడు. త్వరలో టీవీలో ప్రసారం కాబోయే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం కోసం జనం ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన టైంలో మెగాస్టార్‌ గెస్ట్‌గా వచ్చి హాట్‌ సీట్‌లో కూర్చుని తన అనుభవాలని పంచుకున్నారు. ఇప్పుడే ఆయన హోస్ట్‌గా మారి తన ఫ్యాన్స్‌ అనుభవాల్ని స్వయంగా తెలుసుకోనున్నారు. 2016 విజయ దశమి సందర్భంగా స్టార్ట్‌ అయిన ఈ ప్రోగ్రాం అతి త్వరలోనే టీవీలో సందడి చేయనుంది.

Comments

comments