పదేళ్ల తర్వాత ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి తన కలెక్షన్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. మరోవైపు తన 151వ సినిమాను కూడా భారీగా ప్లాన్ చేసుకున్నారు మెగాస్టార్. చాలా రోజులుగా చర్చల్లో ఉన్న చారిత్రక కథాంశం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

READ MORE: పవన్ పట్టించుకోవడం లేదా…?

ఖైదీ నంబర్ 150 తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో చాలా రోజులు ఆలోచన చేసిన చిరు.. ఫైనల్గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికే ఫిక్స్ అయ్యారట. దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పిన ఫైనల్ వర్షన్ కథ విన్న మోగాస్టార్ ప్రీ ప్రొడక్షన్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ లోగా మెగాస్టార్ కొత్త సినిమా పోస్టర్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ హల్చల్ చేస్తోంది.

(యుఎన్) ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అనే టైటిల్ లోగోతో పాటు ఆంగ్లేయులతో కొంతమంది వీరులు పోరాడుతున్న దృశ్యం, గొడ్డలితో పవర్ ఫుల్గా ఉంది, ఈ ప్రీ లుక్. అయితే ఈ పోస్టర్ను యూనిట్ సభ్యులు రిలీజ్ చేయకపోయినా.. ట్విటర్ లో మాత్రం విపరీతంగా పాపులర్ అవుతోంది.

READ MORE: ఈవెంట్‌కు మాస్క్‌లో వచ్చిన బన్నీ

(Visited 116 times, 1 visits today)

Related Post