Cheliya Review and Rating

Click here for CHELIYA English Review 

విడుదల తేదీ: ఏప్రిల్ 7, 2017

దర్శకత్వం: మణిరత్నం

నటీనటులు:  కార్తీ, అదితి రావు, 

నిర్మాత: మణిరత్నం

సంగీతం: ఏ.ఆర్. రెహమాన్

ప్రేమ కధలను తీయడంలో మణిరత్నం స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది, ఆయన దర్శకత్వం లో వచ్చిన “మౌనరాగం”, “గీతాంజలి” “బొంబాయి”, “సఖి” ఎంత పెద్ద హిట్స్ గా నిలిచాయో అందరికి తెలుసు, కానీ ఈమధ్య మణిరత్నం టైం అంత బాగున్నట్టు లేదు, ఎందుకంటే 1986 లో వచ్చిన మౌనరాగం నుండి 2007 లో వచ్చిన గురు వరకు అలోమోస్ట్ అన్ని సూపర్ హిట్స్ అందించిన అయన 2010 లో వచ్చిన రావణ్ నుండి వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఈ మధ్య తీసిన “OK బంగారం” పరవాలేదనిపించింది. తనకి అచ్చోచ్చిన ప్రేమకధనే నమ్ముకుని “చెలియా” అనే సినిమాతో మనముందుకొచ్చారు మణిరత్నం. మరి ఈ సినిమాతోనైనా సూపర్ హిట్ కొడతారేమో మన రివ్యూలో చూద్దాం.

కథ:

1999 లో ఇండియా – పాకిస్తాన్ మధ్య జరిగిన “కార్గిల్” యుద్ధ నేపథ్యంలో తీసిన ఒక లవ్ స్టోరీ ఈ “చెలియా”. వరుణ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ ప్లేన్ పైలట్ గా పనిచేస్తుంటాడు. కార్గిల్ యుద్ధం లో పాకిస్తాన్ చేతికి చిక్కి ‘రావల్పిండి సెంట్రల్ జైలు’ లో చిత్రహింసలు అనుభవిస్తూ తన ప్రేయసి ‘లీల’ కి తనకి మధ్య జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ‘లీల’ కాశ్మీర్ లో పనిచేయడానికి వచ్చిన ఒక డాక్టర్. ‘వరుణ్’ ‘లీల’ ప్రేమలో పడతారు, కానీ వాళ్ళిద్దరి మనస్థత్వాలు భిన్న ధృవాలని మెల్ల మెల్లగా లీల కి అర్ధమవుతుంది. అలంటి భిన్న మనస్తత్వాలున్న ఇద్దరి మధ్య ప్రేమ ఎలా సాగింది ? జైలు లో వున్న వరుణ్ మళ్ళీ లీలని కలిసాడా ? చివరికి ఏమైంది ? తెలుసుకోవాలంటే తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే..?:

గ్రాండ్ విజువల్స్ తో ఎప్పటిలానే మణిరత్నం తన మార్క్ మేకింగ్ తో మ్యాజిక్ చేశారు. సినిమాటోగ్రఫర్ ‘రవి వర్మన్’ సుందరమైన కాశ్మీర్ అందాలను తన కెమెరా తో అద్భుతంగా చూపించారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ కంటికి విందు లా వుంది. కార్తీ, అదితి రావ్ హైదరి తమ పెర్ఫార్మన్స్ తో సినిమాకి వెన్నెముక లా నిలిచారు, ఆ ర్ రహ్మాన్ సంగీతం పరవాలేధనిపించింది, కానీ వీటన్నింటికన్నా కధలో బలం, కధనం లో ఆసక్తి లేకపోతే ఎన్ని వున్నా ప్రాణం లేని బొమ్మకి అలంకారం లా వెలితిగా అనిపిస్తుంది.

Cheliya Review #Karthi New Movie #KaatruVeliyidai #Cheliyaa #Maniratnam

చెలియా విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది. దర్శకుడు సినిమా ని చాలా అద్భుతం గా మొదలుపెట్టాడు కానీ మొదటి 30 నిమిషాల తర్వాత కదా నెమ్మదిస్తుంది, మళ్ళీ వేగం పెరుగుతుంది, మళ్ళీ నెమ్మదిస్తుంది ఇలా సినిమా అంతా కొన్ని మంచి సీన్స్ తో, చాలా బోరింగ్ సీన్స్ తో ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతూ సాగుతుంది. హీరో క్యారక్టరయిజేషన్ ప్రేక్షకులకి విసుగు తెప్పించేలా వుంది, దర్శకుడు హీరో హీరో క్యారక్టరయిజేషన్, స్క్రీన్ ప్లే మీద ఇంకా వర్కౌట్ చేసుంటే బాగుండేది అనిపించింది.

మొత్తం మీద మణిరత్నం చిన్న కధని సాగదీసి చెప్పినట్లుగా వుంది ఈ సినిమా.

 

బలాలు: 

  • సినిమాటోగ్రఫీ
  • లొకేషన్స్
  • కార్తీ
  • మేకింగ్

 

బలహీనతలు:

  • స్లో నరేషన్
  • స్క్రీన్ ప్లే
  • డైరెక్షన్

రేటింగ్: 2.5/5

Click here for CHELIYA English Review 

(Visited 3,818 times, 1 visits today)

Related Post