‘మౌనరాగం’, ‘గీతాంజలి’, ‘రోజా’, ‘బాంబే’, ‘దిల్‌ సే’, ‘సఖి’, ‘ఓకే బంగారం’.. ఇవన్నీ మణిరత్నం చేతి నుంచి జారి పడిన ప్రేమ కథాచిత్రాలు. కానీ ఒకదానికొకటి సంబంధంలేని నేపథ్యాలతో వచ్చిన దృశ్య కావ్యాలు! అందుకే ‘మాస్టర్‌ ఆఫ్‌ మూవీ రొమాన్స్’ అని మణిని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న ‘చెలియా’ కూడా ఆ కోవకు చెందిన చిత్రమని చెప్పుకొంటున్నారు. 

READ MORE: పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేయాలి

యుద్ధ నేపథ్యంలో తీసిన ఈ లవ్‌ స్టోరీలో కార్తీ, అదితీ రావ్‌ హైదరి ప్రేమ జంటగా కనిపించనున్నారు. లడఖ్‌, లే ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపిన ఈ సినిమాలో నిజమైన ఎయిర్‌ క్రాఫ్ట్‌లను ఉపయోగించారు. వాటిని నడుపుతూ పాల్గొనే సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు కార్తీ. ఒక విజువల్‌ వండర్‌గా కూడా కనిపించే ఈ సినిమాకు ఎ.ఆర్‌. రెహమాన్ సమకూర్చిన సంగీతం మరో ప్రధాన ఆకర్షణ. తమిళ వెర్షన్ ‘కాట్రు వెలియిడై’తో పాటు ఏప్రిల్‌ 7న వస్తున్న ‘చెలియా’ సినిమా ప్రేక్షకుల హృదయాలపై ఎలాంటి ముద్ర వేస్తుందో.. చూడాలి మరి.

READ MORE:  వామ్మో యాక్షన్ సీక్వెన్స్ కే అంత బడ్జెట్టా…?

Related Post

Comments

comments