ఓ టీవీ కార్యక్రమంలో పనిచేస్తున్నందుకుగాను, మాజీ క్రికెటర్‌, ఇటీవల పంజాబ్‌ ఎన్నికల్లో గెలిచి, మంత్రి కూడా అయిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ వివాదాల్లోకెక్కిన విషయం విదితమే. మరి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ‘జబర్దస్త్‌’ టీవీ ప్రోగ్రామ్‌లో నటించడం తప్పు కాదా.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోందిప్పుడు.

READ MORE: అలాంటి కథే కావాలంటున్న రాజమౌళి…!

ఇక, ‘జబర్దస్త్‌’ కామెడీ ప్రోగ్రామ్‌ విషయానికొస్తే, పేరుకి కామెడీ షో అయినా.. అందులో అడల్ట్‌ కంటెంట్‌ ఎక్కువయిపోయిందన్న విమర్శలు ఎప్పటినుంచో విన్పిస్తున్నాయి. తాజాగా, నందనం దివాకర్‌ అనే వ్యక్తి ‘జబర్దస్త్‌’కి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సినిమాలకు సెన్సార్‌ వున్నప్పుడు, బుల్లితెరకు ఎందుకు సెన్సార్‌ వుండదన్నది ఆయన వాదన.

READ MORE: రెడ్డిగారు…?

మహిళా ఎమ్మెల్యే అయి వుండీ, మహిళల్ని కించపర్చేలా వున్న కామెడీ స్కిట్స్‌, అందులోని పాత్రల్ని ఆమె జడ్జిగా ఎంకరేజ్‌ చేయడమేంటన్న ప్రశ్న చాలామంది నుంచి వ్యక్తమవుతోంది. ఎందుకంటే మహిళా ప్రజా ప్రతినిథి గనుక, రాజకీయంగా, నైతికంగా ‘జబర్దస్త్‌’ రోజాకి బ్యాడ్‌ నేమ్‌ తీసుకొస్తోందన్నది నిజమే. మరి ఇలాంటి నేపథ్యంలో రోజా షో నుండి తప్పుకుంటుందో లేదో చూడాలి మరి.

(Visited 475 times, 1 visits today)

Related Post