ఒక టైమ్‌లో బ్రహ్మానందం లేకపోతే తెలుగు సినిమా వుండదు అన్న రేంజ్‌లో వరుసపెట్టి సినిమాలు చేస్తూ పోయిన స్టార్‌ కమెడియన్‌కి ఇప్పుడు అవకాశాలు పెద్దగా లేవు. యంగ్‌ కమెడియన్స్‌ సప్తగిరి, వెన్నెల కిషోర్ లాంటి చాలా మంది వచ్చేయడం, బ్రహ్మానందం కోసం కొత్త రకం పాత్రలు సృష్టించడంలో దర్శకులు విఫలం కావడం, అన్నిటికీ మించి సెట్స్‌లో ఆయన ప్రవర్తనపై కంప్లయింట్స్‌ వుండడంతో బ్రహ్మీ హవా తగ్గిపోయింది.

ఇటీవల అవకాశాలు బాగా తగ్గడంతో మళ్లీ బ్రేక్‌ కోసం చూస్తోన్న బ్రహ్మానందం ‘ఖైదీ నంబర్‌ 150’పై చాలా ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవితో వున్న అనుబంధం కారణంగా బ్రహ్మీ కోసమే ఈ పాత్రని సృష్టించారు. డాబర్‌మేన్‌గా బ్రహ్మానందం బాగానే నవ్వులు పండించినప్పటికీ అది గుర్తుండిపోయేంత గొప్ప కామెడీ కాకపోవడంతో, ఖైదీ బ్లాక్‌బస్టర్‌ అయినా కానీ బ్రహ్మానందానికి మాత్రం దాంతో ఏమీ ఒరిగినట్టు లేదు.

ఇప్పటికీ బ్రహ్మానందంకి ఆఫర్లు రావడం లేదు. శ్రీను వైట్ల, త్రివిక్రమ్‌లాంటి దర్శకులు బ్రహ్మానందం కోసమే పాత్రలు సృష్టించేవారు. ఇప్పుడు వాళ్లు కూడా బ్రహ్మీని లైట్‌ తీసుకుంటూ ఉండడంతో వెటరన్‌ కమెడియన్‌ వెనకబడిపోయారు. తనకి రెగ్యులర్‌గా ఇచ్చే పారితోషికంలో సగం ఇచ్చినా ఓకే అని బ్రహ్మానందం చెబుతున్నా కానీ రోజుకి యాభై వేలకి జబర్దస్త్‌ కమెడియన్లు దొరికేస్తున్నారని నిర్మాతలు బ్రహ్మీ వైపు కూడా చూడ్డం లేదు.

Related Post

Comments

comments