‘ఖైదీ నంబర్-150’ తర్వాత చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న నెక్స్ట్ మూవీ “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కే ఈ సినిమాకోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా రంగంలోకి దిగారనే ప్రచారం సాగుతోంది. ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్నాడు చిరంజీవి. “ఉయ్యాలవాడ” మూవీ ఇంకా సెట్స్ పైకి కూడా వెళ్లకముందే బోయపాటి సినిమాకు స్క్రిప్ట్ సిద్ధమైపోయిందట. ఈ విషయాన్ని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించడం విశేషం…

READ MORE: బాహుబలి 2 విషయంలో కరణ్ క్రిమినల్ మైండ్…!

ఇటీవల ఓ కార్యక్రమంలో ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌పై పెదవి విప్పాడు అరవింద్. మెగాస్టార్ కోసం బోయపాటి ఓ అద్భుతమైన మాస్ స్టోరీ సిద్ధం చేశాడని కెరీర్‌లో చిరు ఇప్పటివరకూ ఇలాంటి పాత్రను పోషించలేదని ప్రకటించాడట అరవింద్. అసలే స్టార్ హీరోలతో బోయపాటి సినిమా అనగానే భారీ అంచనాలుంటాయి. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమా చేస్తోన్న బోయపాటి ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే, చిరు మూవీపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నాడు. మరి బాలయ్యకు భారీ విజయాలు ఇచ్చిన బోయపాటి చిరుతోనూ బ్లాక్‌బస్టర్ అందుకుంటాడేమో చూద్దాం..!

(Visited 313 times, 1 visits today)

Related Post