Black Money Review in English

విడుదల తేదీ: ఏప్రిల్ 21, 2017

దర్శకత్వం: జోషి 

నటీనటులు: మోహన్ లాల్, అమలాపాల్

నిర్మాత: నిజాముద్దీన్ 

సంగీతం: రితేష్ – అభిషేక్ 

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన చిత్రాలు, తెలుగులోకి డబ్బింగ్ అయిన ఆయన సినిమాలు ఘనవిజయాన్ని సాధించాయి. జనతా గ్యారేజ్, మన్యంపులి, కనుపాప సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. తెలుగులో ప్రేక్షకుల ఆదరణను సంపాదించుకొన్న మోహన్‌లాల్ మరోసారి ‘బ్లాక్ మనీ’ సినిమాతో ముందుకొచ్చారు. ఈ చిత్రం 2012లో మలయాళంలో ఘన విజయం సాధించిన రన్ బేబీ రన్ చిత్రానికి మాతృక. మరి ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో మన రివ్యూ లో చూద్దాం.

కథ:

వేణు(మోహన్ లాల్) ఇంటర్నేషనల్ ఛానల్స్‌తో కలిసి పని చేసే కెమెరామెన్. తను చేసే ఎక్స్‌క్లూజివ్ స్టోరీస్ కోసం అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఐదేళ్ల తరువాత వేణు తన సొంతవూరికి తిరిగి వస్తాడు. లోకల్ ఛానల్స్ వాళ్లు వేణుతో పని చేయించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ప్రముఖ ఛానల్‌కు చెందిన రేణుక(అమలాపాల్) అంటే వేణుకి అస్సలు పడదు కారణం గతంలో వేణు, రేణుకాలు ప్రేమించుకుని విడిపోవడం వల్ల.

గతంలో వేణు, రేణుక కలిసి చేసిన ఓ స్టోరీ కారణంగా ముఖ్యమంత్రి కావల్సిన భవానీ ప్రసాద్(సాయి కుమార్) అనే రాజకీయ నాయకుడు తన పరపతిని కోల్పోతాడు. అప్పటినుంచి భవానీ ప్రసాద్.. వేణు, రేణుకలపై పగ పెంచుకుంటాడు. మళ్లీ చాలా కాలం తరువాత వేణు, రేణుకతో కలిసి ఓ స్ట్రింగ్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. అవి ఏంటి? చివరికి వేణు, రేణుక ఏంచేస్తారు? వేణు, రేణుకలపై భవానీ ప్రసాద్ తన పగను ఎలా తీర్చుకున్నాడు..? అనే విషయాలు తెలియాలంటే మాత్రం తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే..?:

వీడియో జర్నలిస్టు పాత్రలో మోహన్ లాల్ జీవించారు. కెమెరామెన్‌గా ఆయన చూపించిన హావభావాలు ప్రేక్షకుడిని ఆకట్టుకొంటాయి. కీలక సన్నివేశాలలో ఆయన నటన, డైలాగ్స్ డెలివరి బాగున్నాయి. ఇలాంటి పాత్రలు పోషించడం మోహన్‌లాల్‌కు మాములే అని చెప్పవచ్చు. సీనియర్ ఎడిటర్‌గా అమలాపాల్ తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించింది. నటన ఎక్కువగా ఫెర్ఫార్మెన్స్ చేయలేని పాత్ర పోషించనప్పటికీ పూర్తిస్థాయిలో న్యాయం చేకూర్చింది. కెరీర్‌ కోసం పాకులాడే జర్నలిస్టు పాత్రలో ఒదిగిపోయింది.

మిగితా పాత్రల్లో బిజు మీనన్, అపర్ణా నాయర్, సాయి కుమార్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించారు. వీరంతా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోవడం కారణంగా వారు ఆ పాత్రల్లో గుర్తుండిపోవడం కష్టం. చాలా సీరియస్‌గా సాగే ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అదనపు బలంగా మారింది. కీలక ఎపిసోడ్స్‌ను ఆర్డీ రాజశేఖర్ చాలా చక్కగా తెరకెక్కించారు. సాధారణ సన్నివేశాన్ని కూడా తెరపైన ఆసక్తిగా చూపించడంలో తన ప్రతిభను రాజశేఖర్ కనబరిచారని చెప్పవచ్చు. దర్శకుడు జోషి మీడియాను బాగా స్టడీ చేశారు. ప్రతీ చిన్న విషయాన్ని కూడా చాలా కేర్ ఫుల్ గా డీల్ చేశారు. ప్రథమార్థంలో మోహన్ లాల్ అమాలా పాల్ చేసే స్ట్రింగ్ ఆపరేషన్ ఆ తర్వాత జరిగిన పరిణామాల్ని బాగా చూపించారు. రెండో భాగంలో భవానీ ప్రసాద్ చేయబోయే మర్డర్ గురించిన సీన్స్ ని బాగా ప్లాన్ చేశారు. చిత్ర నిర్మాణ విలువలు బావున్నాయి. 

కానీ ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. వినోదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సినిమా మొత్తం స్టింగ్ ఆపరేషన్ల పైనా చూపించడం వల్ల చాల మంది బొర్ గా ఫీల్ అవుతారు…. పైగా సినిమా మొత్తం చాలా నెమ్మదిగా నడవటం కూడా సినిమాకి మైనస్ గా చెప్పుకోవచ్చు.

చివరగా…కొత్త కథలను కోరుకునే ప్రేక్షకులకి మాత్రమే

బలాలు:

  • పాజిటివ్ అంశాలు
  • కథ
  • మోహన్ లాల్ యాక్టింగ్

బలహీనతలు:

  • సినిమాలో కమర్షియల్ హంగులు లేకపోవడం
  • కథనం
  • గుర్తింపు పొందిన నటులు లేకపోవడం

రేటింగ్: 2.5/5

(Visited 410 times, 1 visits today)

Related Post