హీరోయిన్ల విషయంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ స్టయిలే వేరు. తన కొడుకును హీరోగా పెట్టి సినిమా తీసిన ప్రతిసారి హీరోయిన్లకు భారీ చెక్కులు ఆఫర్ చేశాడు ఈ ప్రొడ్యూసర్. మొదటి సినిమాకే సమంతను లైన్లోపెట్టాడు. అదే సినిమాలో తమన్నతో ఐటెంసాంగ్ చేయించాడు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ రెండో సినిమాకు కూడా తమన్నతో ఐటెంసాంగ్ చేయించాడు. మూడో సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇప్పటివరకు చెప్పుకున్న ప్రతి సందర్భంలో హీరోయిన్లకు వాళ్ల మార్కెట్ రేటు కంటే 50శాతం ఎక్కువగానే సమర్పించుకున్నాడు బెల్లంకొండ సురేష్. ఇప్పుడీ నిర్మాత కన్ను కీర్తి సురేష్ పై పడింది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా కంప్లీట్ అయిన వెంటనే.. తన కొడుకును హీరోగా పెట్టి మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు బెల్లంకొండ. ఎప్పట్లానే ఈ ప్రాజెక్టుకు కూడా దర్శకుడి కంటే ముందు హీరోయిన్ ను ఫిక్స్ చేసే పనిలో పడ్డాడు. ఇందులో భాగంగా టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న కీర్తిసురేశ్ పై ఈ నిర్మాత కన్నుపడింది. ఈమెకు ఏకంగా కోటి 70లక్షల రూపాయలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట బెల్లంకొండ.

ప్రస్తుతం కీర్తిసురేష్ కు తెలుగులో అంత మార్కెట్ లేదు. తెలుగులో ఆమెకు కోటి రూపాయలు ఇచ్చే నిర్మాత లేడు. కానీ బెల్లంకొండ మాత్రం తన కొడుకు సరసన నటిస్తే ఏకంగా కోటి 70లక్షల రూపాయలు ఇస్తానని ఊరిస్తున్నాడట. ప్రస్తుతం ఈ హాట్ ఆఫర్ పై కీర్తిసురేష్ ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు.

(Visited 261 times, 1 visits today)

Related Post