బాహుబలి మొదటి పార్ట్ జులై 10, 2015న విడుదలైంది. అంటే దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఇప్పుడు బాహుబలి రెండో పార్ట్ కూడా మరో నెల రోజుల్లో విడుదల కాబోతోంది. 2017 ఏప్రిల్ 28న బాహుబలి 2 థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే విడుదలైన పార్ట్ 2 ట్రైలర్‌కు విశేష స్పందన రావడంతో రాజమౌళి మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. బాహుబలి 2 విడుదలయ్యే రెండు వారాల్లోపు మరోసారి బాహుబలి మొదటి పార్ట్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు రాజమౌళి ప్రకటించాడు.

READ MORE: బాహుబలి-2 ట్రైలర్‌

అయితే ఇందులో ఎలాంటి వ్యాపార దృక్ఫథం లేదని, బాహుబలి2లో ఉన్న కథ విషయంలో ప్రేక్షకుడు తికమకకు లోనవ్వకూడదనే ఉద్దేశంతోనే మొదటి పార్ట్‌ను మరోసారి రిలీజ్ చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించాడు. అయితే కొన్ని థియేటర్లలో మాత్రమే ఈ ప్రత్యేక షో ప్రదర్శించనున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తుంటే, కొందరు మాత్రం బిజినెస్ గానే నిర్మాతలు, దర్శకుడు రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నారు.

READ MORE: రాశి ‘లంక’ టీజర్ విడుదల

Related Post

Comments

comments