రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన బాహుబలి కంక్లూజన్ విజయవంతంగా మూడో వారాన్ని పూర్తిచేసుకోబోతోంది. గతనెల 28 న 9,000 థియేటర్లలో నాలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని ఏరియాల్లో కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. పది రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి అత్యధిక వేగంగా ఈ మార్క్ ని దాటిన మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది.

READ MORE: చంద్రహాస్ 5 కోట్లు పెట్టి తీసా: హరనాథ్ పొలిచెర్ల ఇంటర్వ్యూ

నిన్నటి(21 రోజులు) తో ఈ మూవీ 1507 కోట్లు వసూలు చేసింది. దీంతో 21 రోజుల్లో 1500 కోట్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా బాహుబలి కంక్లూజన్ చరిత్ర లిఖించనుంది.

21 రోజుల్లో బాహుబలి 2 వసూళ్ల వివరాలు

ఇండియా:

గ్రాస్: 1240.39 కోట్లు

నెట్: 929 కోట్లు

ఓవర్సీస్ :

గ్రాస్: 267 కోట్లు

వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 1507.39 కోట్లు

(Visited 2,212 times, 1 visits today)

Related Post