ఈ ట్రైలర్ చూస్తుంటే ఎక్కువగా యాక్షన్ సీన్స్ కి ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ట్రైలర్ లో ప్రభాస్, రానా మధ్య వచ్చే ఫైట్ సీన్స్‌, యుద్ధ సన్నివేశాలు, అనుష్క సైనికులతో పోరాడడం వంటి సీన్స్ ఎక్కువగా వున్నాయి. పైగా ‘‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా’’ అని బాహుబలి కట్టప్పను ఉద్దేశించి చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయం ఉత్కంఠ రేపుతుంటే, ఇప్పుడు ఈ డైలాగ్ ఆ ఉత్కంఠని మరింత పెంచింది. మొత్తం మీద ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డ్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. సోషల్ మీడియతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో ఈ ట్రైలర్‌ను ప్రదర్శించారు.

(Visited 51 times, 1 visits today)

Related Post