‘బాహుబలి 2: ది కంక్లూజన్’ మూవీ రివ్యూ

Baahubali 2 Review, Baahubali 2 Review and rating, Baahubali 2 telugu Review, Baahubali 2 telugu Review rating

Read this review in English here

విడుదల తేదీ: ఏప్రిల్ 28, 2017

దర్శకత్వం: ఎస్ ఎస్ రాజమౌళి

నటీనటులు: ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నా

నిర్మాత: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని,

సంగీతం: ఎమ్ ఎమ్ కీరవాణి

దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాహుబలి తొలిభాగం సంచలన విజయం సాధించింది. ఎమోషనల్ సీన్స్ తక్కువగా ఉండి, పాత్రల పరిచయాల కోసం మరియు యుద్ధ సన్నివేశాల కోసం ఎక్కువ సమయం కేటాయించిన బాహుబలి తొలి భాగం భారీ విజయం సాధించటంతో అసలు కథ నడిచే బాహుబలి 2పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. మరి బాహుబలి 2 ఆ అంచనాలను అందుకుందా..? లేదా ..? అనేది మన రివ్యూ లో చూద్దాం.

కథ:

బాహుబలి, భల్లాలదేవ సరి సమానమైన ధైర్య సాహసాలతో కాలకేయులను ఓడించిన తర్వాత ప్రజలను కాపాడిన తీరును బట్టి రాజమాత శివగామి దేవి బాహుబలిని మహారాజును చేయాలనుకుంటుంది. దీంతో పగతో రగిలిపోతూ, భల్లాలదేవ సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటాడు. పట్టాభిషేకానికి ముందు రాజ్య పర్యటన చేయమని బాహుబలిని పంపిస్తుంది శివగామి. అక్కడ దేవసేనని చూసి మనసుపడతాడు బాహుబలి. ఇదే సమయంలో దేవసేన చిత్రపటం చూసి మనసుపడతాడు భల్లాలదేవ. ఇక్కడనుండి అసలు కథ మొదలవుతుంది. మనసుపడిన దేవసేనని బాహుబలి ఎలా దక్కించుకున్నాడు …? పగతో రగిలిపోతున్న భల్లాలదేవ సింహాసనం కోసం, బహుబలిని చంపడం కోసం ఎలాంటి కుతంత్రాలు పన్నాడు …? చివరికి శివుడు భల్లాలదేవుడి పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే మిగిలిన కథ.

ఎలా ఉందంటే..?:

బాహుబలి-2 ఎలావుందో చెప్పడానికి చాలా అంశాలు వున్నాయి, కానీ అవన్నీ ఈ రివ్యూ లో చెప్పడం చాలా కష్టం కాబట్టి కొన్ని ప్రధానమైన అంశాలగురించి చెప్పుకుందాం. మొదటగా చెప్పుకోవాల్సింది సినిమాలోని ఎమోషనల్ సీన్స్ గురించి ఎందుకంటే చాలా మంది బాహుబలి-1 లో ఏముంది అంతా గ్రాఫిక్స్, యుద్ధం మాత్రమే కదా అన్నవాళ్ళకి సమాధానంగా ఈ పార్ట్ లో ఎమోషన్ ని ప్రధాన ఆయుధంగా చేసుకుని కథని నడిపారు దర్శకుడు రాజమౌళి. కొన్ని కొన్ని సీన్స్ లో ఉద్వేగంతో కళ్ళు చెమర్చేలా చేశారు. ఎమోషనల్ కంటెంట్ తోపాటు అబ్బురపరిచే విజువల్స్ తో ప్రతి ఫ్రేమ్ ని తీర్చిదిద్దారు. బాహుబలి ఇంట్రడక్షన్, కుంతల రాజ్యం అందాలు, హంసనావ సాంగ్, ఇంటర్వెల్ సీన్, బాహుబలి రాజ సభలో సేనాపతి తల నరికే సీన్ సినిమా మొత్తానికి హైలైట్స్ గా నిలిచాయి. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ తమ పాత్రలకి ప్రాణ ప్రతిష్ట చేసారు. ఈ సినిమాతో దర్శకుడిగా తనకి తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు రాజమౌళి.

అన్ని సినిమాలలో వున్నట్లే బాహబలి-2 లో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ వున్నాయి, అవేంటంటే సినిమా ప్రారంభంలో దేవసేనని మెప్పించడానికి బాహుబలి చేసే ప్రయత్నాలు ఆ సమయంలో వచ్చే సన్నివేశాలు ఒక మామూలు తెలుగు సినిమాని తలపించాయి, దాంతో పాటు క్లైమాక్స్ లో వచ్చే యుద్ధ సన్నివేశంలోని కొన్ని సీన్స్ నమ్మశక్యంగా అనిపించలేదు. వీటితోపాటు కొన్ని చోట్ల అది గ్రాఫికల్ వర్క్ అని క్లియర్ గా తెలిసిపోయేలా వుంది. ఇవన్నీ మొత్తం సినిమా మీద చూపించే ప్రభావం చాలా తక్కువనే చెప్పుకోవాలి ఎందుకంటే ఏ సినిమాకైనా ప్రేక్షకుడు కథలోని ఎమోషన్ తో కనెక్ట్ అయితే ఇవన్నీ పెద్ద లోపాలుగా అనిపించవు.

మొత్తంగా ఈ సమ్మర్ లో బాహుబలి-2 ప్రతి సినీ అభిమానికి ఒక విందు అనే చెప్పుకోవాలి.

బలాలు:

  • దర్శకత్వం
  • ప్రధాన పాత్రధారుల యాక్షన్ (ముఖ్యంగా ప్రభాస్)
  • ఎమోషనల్ సీన్స్
  • సాంగ్స్

బలహీనతలు:

  • క్లైమాక్స్ ఫైట్ లోని కొన్ని సీన్స్
  • దేవసేనని మెప్పించడానికి బాహుబలి చేసే ప్రయత్నాలు
  • కొన్ని సీన్స్ లోని గ్రాఫికల్ వర్క్

రేటింగ్: 4/5

 

Read this review in English here

(Visited 4,082 times, 1 visits today)

Related Post