పాకిస్తాన్ లాంటి దేశంలో బాహుబలి-2 సినిమా విడుదలైంది. విడుదలవడమే కాదు.. అక్కడా సునామీని సృష్టిస్తోంది. ఇటీవలే భారత సినిమాలపై నిషేధాన్ని ఎత్తేసిన పాకిస్థాన్‌లో బాహుబలి సినిమా విడుదలైంది. లాహోర్, కరాచి వంటి ప్రధాన నగరాలతో పాటు పలు పట్టణాల్లోని వంద స్క్రీన్లపై సినిమా విడుదలైంది. హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించే సినిమా అయినప్పటికీ పాకిస్థాన్‌లోనూ దానికి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. సినీ అభిమానులు థియేటర్ల వద్ద క్యూలు కట్టేస్తున్నారని అక్కడ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వర్గాలు చెబుతున్నాయి. సినిమా థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో కళకళలాడిపోతున్నాయని డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు.

READ MORE: ‘బాహుబలి 2’ 21 డేస్ కలెక్షన్స్

వాస్తవంగా పాకిస్థాన్‌లో భారత సినిమాలకు సెన్సార్ కట్లు ఎక్కువగా పడుతుంటాయని, కానీ, బాహుబలి-2 విషయంలో మాత్రం పాక్ సెన్సార్ బోర్డు మినహాయింపునిచ్చిందని, కనీసం ఒక్క కట్ కూడా లేకుండా అక్కడ సినిమాకు ‘యూ’ సర్టిఫికెట్‌ను ఇచ్చారని అంటున్నారు. అక్కడ సినిమా రూ.6 కోట్ల వరకూ వసూళ్లు దక్కించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ స్థాయి వసూళ్లు వస్తే మాత్రం సినిమా సూపర్ హిట్టేనని అంటున్నారు. ఇక, ఆ సినిమాపై అక్కడ ఎంతలా క్రేజ్ పెరిగిపోయిందంటే.. టీవీ చానెళ్లలోనూ ప్రముఖ నటీనటులతో ‘బాహుబలి డిబేట్లు’ నిర్వహిస్తున్నారు. అక్కడ థియేటర్ల వద్ద రషెస్‌ను ఫిల్మ్ క్రిటక్ ఉమైర్ సంధూ.. ట్విట్టర్‌లో ఫొటోల ద్వారా తెలియజేశాడు.

(Visited 315 times, 1 visits today)

Related Post