అలనాటి మహానటి సావిత్రి జీవిత ఘటనల ఆధారంగా ‘మహానటి’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత, కీర్తి సురేష్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరితో పాటు ఇందులో అనుష్క కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో సమంత విలేకరిగా, కీర్తి సావిత్రిగా నటిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పుడు అనుష్క అలనాటి నటి జమున పాత్రలో నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు.

(Visited 49 times, 1 visits today)

Related Post