యాంకర్ అనసూయ బుల్లితెరపై సందడి చేస్తునే.. వెండితెరపై అప్పుడప్పుడు మెరుస్తోంది. నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ‘క్షణం’లో సీరియస్ పాత్రలోనూ మెప్పించింది. తాజాగా, ‘విన్నర్’ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో కుడా నటించింది.

అయితే, అనసూయకి విన్నర్ కంటే ముందే ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చాడు. అప్పట్లో పవన్ ఆఫర్ ని అనసూయ తిరస్కరించడం సంచలన వార్త అయ్యింది. పవన్ అభిమానులు అనసూయకి ఎక్కువైందని తిట్టుకొన్నారు. ఇప్పటికీ ఆమెపై కోపంగానే ఉన్నారు. అయితే, మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజు ‘విన్నర్’లో అనసూయ స్పెషల్ సాంగ్ కి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి పవన్ సినిమా ఆఫర్ చర్చకు వచ్చింది.

ఈ సారి స్వయంగా అనసూయ స్పందించింది. పవన్ సినిమాలో ఆఫర్ అంటే ఎవరైనా కాదంటారా.. ? ఆ టైంలో నేను గర్భవతిని… అందుకే పవన్ సినిమా ఆఫర్ ని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

Comments

comments