వరుస ఆఫర్లు అందుకుంటూ మంచి స్పీడ్ తో నెంబర్ 1 పోసిషన్ కి చేరువవుతున్న అమీ జాక్సన్ కెరీర్ మాంచి ఊపు మీద ఉందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ బ్రిటీష్ బ్యూటీ ‘రోబో 2.0’ మూవీ లో నటిస్తోంది. ఇదిలా ఉండగా అమ్మడుకి క్రేజీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి… ఓ వైపు బాలీవుడ్‌లోనూ బడా ఆఫర్లకు గేలం వేస్తున్న ఈ స్లిమ్ బ్యూటీ… అన్ని కథలను ఒప్పుకోకుండా విభిన్నమైన కాన్సెప్ట్‌లను ఒప్పుకుంటు కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటోంది. తాజాగా కోలీవుడ్‌లో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట అమీ.

పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేయాలి

రొటీన్‌కు భిన్నమైన కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్న తమిళ హీరో విజయ్ సేతుపతి… తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. త్వరలో దర్శకుడు గోకుల్ తెరకెక్కిస్తున్న ‘ఆసైపట్టై బాలకుమారా 2’ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలోనే అమీ జాక్సన్ హీరోయిన్‌గా ఫైనలైజ్ అయింది. ఇందులో నాయిక పాత్రకు ఎక్కువ వెయిటేజీ ఉండటంతో అమ్మడు వెంటనే ఈ ఆఫర్‌ను ఓకే చేసిందట. మరి అటు గ్లామరస్ క్యారెక్టర్లతో పాటూ, ఇటు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లను ఎంచుకుంటూ అమీ అందరిని సప్రైజ్ చేసేస్తుంది.

చిరంజీవి కొత్త సినిమా ప్రీ లుక్ ఇదేనా..?

Related Post

Comments

comments