గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఎప్పుడైతే పవన్ గురించి ‘చెప్పను బ్రదర్’ అని అన్నాడో.. ఆ రోజు నుండి అభిమానుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఆ తరువాత పవన్ దీనిపై మాట్లాడక పోయినా.. దీనిపై అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా.. పవన్ అభిమానులు మాత్రం కూల్ అవ్వలేదు.

ఈ వివాదం నేపథ్యంలో.. ఇటీవల విడుదల అయిన అల్లు అర్జున్ కొత్త చిత్రం దువ్వాడ జగన్నాథం (డీజే) టీజర్ కు డిస్ లైక్స్ రావడానికి పవన్ అభిమానుల హస్తం ఉందని బన్నీ అభిమానులు ఆరోపిస్తున్నారు. అలానే కాటమరాయుడు టీజర్ కు కూడా ఇదే తరహాలో డిస్ లైక్స్ వచ్చాయని.. ఈ పని బన్నీ అభిమానులే చేశారని పవన్ కళ్యాణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీనితో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రముఖ నిర్మాత, బన్నీ తండ్రి అల్లు అరవింద్ రంగంలోకి దిగినట్లు సినీ వర్గాల ధ్వారా తెలుస్తుంది.

ఈ సమస్యకు తక్షణం పరిష్కారం చూడకపోతే.. ఈ ప్రభావం డీజే సినిమాపై పడే ప్రమాదం ఉందని అరవింద్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలానే కొనసాగితే.. అల్లు అర్జున్ కెరియర్ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉండడంతో.. ‘డీజే’ సినిమాలోని ఓ పాటను పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయించాలని అరవింద్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అలా చేయడం వలన.. పవన్ అభిమానులను కొంత వరకు శాంతింపజేయవచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి, నాగబాబుల దృష్టికి తీసుకువెళ్లి.. వారి సహకారాన్ని తీసుకోవాలని అరవింద్ భావిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

Comments

comments