టాలీవుడ్‌లో అఖిల్ పెళ్లి ఆగిపోయిందంటూ పెద్ద రూమర్ నడుస్తోంది.అక్కినేని వారసుడు అఖిల్ నిశ్చితార్ధం శ్రేయా భూపాల్‌తో ఇటీవలే వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.. ఒక రకంగా నాగ్ పెద్ద కొడుకు అయిన నాగచైతన్య కంటే ముందుగానే అఖిల్ వివాహం జరుగుతుందనే విషయం ఖరారు కావడం, అందుకు తగిన విధంగా ఇటలీలో ఏర్పాట్లు జరగడం అంతా పక్కా ప్రణాళిక ప్రకారం సిద్ధమైంది. కానీ, ఉన్నట్లుండి ఈ వేడుక రద్దు కావడం, అలాగే బుక్ చేసుకున్న టికెట్లు కూడా కాన్సిల్ చేసుకోవడం వంటివి వడివడిగా జరిగిపోయిందన్న సమాచారంతో, విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని అర్ధమవుతోంది.

దీనికి కారణం కుటుంబ సభ్యులు మాత్రం కాదని, పెళ్లికూతురు, పెళ్లికొడుకుల మధ్య జరిగిన వ్యవహారం కారణమని తెలుస్తోంది. అందుకే ఇక ఈ పెళ్లిని ఆపేయాలని ఈ రెండు బడా ఫ్యామిలీలు ఫిక్స్ అయ్యాయట. పెళ్లి తరువాత ఇబ్బంది పడటం కంటే విడిపోవడమే బెటర్ అనే ఆలోచనతో ఇరు వర్గాలు చర్చించుకొని పెళ్లి విషయాన్ని పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ రెండు కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. దాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Related Post

Comments

comments