తెలుగులో ‘జ్యోతిలక్ష్మి’, ‘డీకే బోస్‌’ వంటి సినిమాల్లో విలన్‌గా అలరించిన అజయ్‌ ఘోష్‌ టాలీవుడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తమిళ సినీ పరిశ్రమ ముందు తెలుగు సినీ ఇండస్ట్రీ ఎందుకూ పనికిరాదని, టాలీవుడ్‌ వేస్ట్‌ అని విమర్శించాడు. పనిలో పనిగా తెలుగు మీడియాపై విమర్శలు గుప్పించాడు.

READ MORE: దర్శకుడు మణిరత్నంపై ఆరోపణలు…!

తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాల కోసం కెమెరా ముందే కాకుండా కెమెరా వెనుక కూడా నటించాలని, తమిళ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి లేదని తెలిపాడు. తమిళంలో వెట్రిమారన్‌ వంటి గొప్ప దర్శకులు ఉన్నారని, తెలుగు దర్శకులకు బ్లాక్‌ కళ్లజోడు పెట్టుకుని ఫోజులు కొట్టడం తప్ప మరేదీ చేతకాదని అన్నాడు. పనిలోపనిగా తెలుగు ప్రజలను కూడా తీవ్రంగా విమర్శించాడు అజయ్‌. తమిళనాడులో ఆటో డ్రైవర్‌ కూడా పేపర్‌ చదువుతూ కనబడతాడని, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గుట్కా, పాన్‌ నములుతూ కూర్చుంటారని ఎద్దేవా చేశాడు. అలాగే తమిళ సాంబారు అమృతంలా ఉంటుందని, తెలుగువారు చేసే సాంబారు రుచి చూస్తే కడుపునొప్పి, మోషన్స్‌ వస్తాయని అన్నాడు.

Related Post

Comments

comments