దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం లాంటి హిట్ చిత్రాల తరువాత మంచు విష్ణు, జి.నాగేశ్వర్రెడ్డిల కాంబినేషన్లో తెరకెక్కనున్న మూడో చిత్రం ఆచారి అమెరికా యాత్ర. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం ఆచారి పాత్రలో నటిస్తున్నారు. ఢీ, దేనికైనా రెడీ చిత్రాల్లో సూపర్బ్ కామెడీతో ఆకట్టుకున్న విష్ణు, బ్రహ్మి జోడి మరోసారి తెర మీద నవ్వులు పూయించనుంది. ఎక్కువభాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న ఆచారి అమెరికా యాత్ర సినిమా శనివారం లాంచనంగా ప్రారంభమైంది.

READ MOREబాహుబలి-2 ట్రైలర్‌

పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై ఎమ్ ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ సినిమాలో విష్ణు, బ్రహ్మానందంలు కృష్ణమాచారి, అప్పలాచారిగా కనిపించనున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఆచారి అమెరికా యాత్ర మంచు విష్ణు కెరీర్ లో మరో హిట్ గా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

READ MORE: వామ్మో యాక్షన్ సీక్వెన్స్ కే అంత బడ్జెట్టా…?

Related Post

Comments

comments