బాలీవుడ్‌ స్టార్ హీరో ఆమిర్‌ ఖాన్‌కి పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఆయన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. ఆమిర్‌ చివరిగా నటించిన ‘దంగల్‌’ సినిమా బాలీవుడ్‌లో 2016లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమాకు ఆమిర్‌ సుమారు రూ.175 కోట్లు తీసుకున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి.

READ MORE: వామ్మో యాక్షన్ సీక్వెన్స్ కే అంత బడ్జెట్టా…?

డిస్నీ యూటీవీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఆమిర్‌ సినిమా చిత్రీకరణకు ముందు అడ్వాన్స్‌గా రూ.35 కోట్లు తీసుకున్నాడు… దీనితో పాటు ఒప్పందంలో భాగంగా 33 శాతం వాటా, శాటిలైట్‌ రైట్స్‌, సినిమా విడుదలయ్యాక వచ్చే కలెక్షన్స్‌లో మరో 33 శాతం వాటా తీసుకున్నట్లు సమాచారం. ప్రతి సినిమాకు ఏడాదికి పైనే టైం తీసుకున్నా ఆమిర్‌ రూ.100 కోట్లకుపైగానే పారితోషికం తీసుకుంటూ బాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఆమిర్‌ ప్రస్తుతం సీక్రెట్‌ సూపర్‌స్టార్‌, థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌లో నటిస్తున్నాడు.

READ MORE: చిరంజీవి కొత్త సినిమా ప్రీ లుక్ ఇదేనా..?

(Visited 35 times, 1 visits today)

Related Post