ఇటీవలే ‘రోబో 2.0’ చిత్రం శాటిలైట్ రైట్స్ 110 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి.. అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కొత్త సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ శాటిలైట్ రైట్స్.. ఏకంగా 120 కోట్లకు అమ్ముడుపోయి ఇప్పుడు సరికొత్త రికార్డ్ సృష్టించింది.

READ MORE: పవన్ కళ్యాణ్ పై మరోసారి వర్మ సెటైర్

ఇంటర్నేషనల్‌గా 86 మిలియన్స్ సబ్ స్క్రైబర్స్ కలిగిన ఇంటర్నెట్ టీవీ ‘నెట్ ఫ్లిక్స్’.. ఆమిర్ ఖాన్ అప్ కమింగ్ మూవీ శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను ఈ భారీ మొత్తానికి కొనేసిందట. ‘ధూమ్-3’ ఫేమ్ విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం.. ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్’ నవల ఆధారంగా తెరకెక్కుతోందట. 1839లో వచ్చిన ఈ నవల.. బ్రిటీష్ ఇండియా కాలంలో దారిదోపిడీలు, హత్యలు చేసే దుండగుల కథతో సాగుతుంది.

ఇక ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ అమితాబ్ బచ్చన్‌తో కలసి నటించబోతున్నాడు ఆమిర్ ఖాన్. ఈ ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం 2018 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొత్తంమీద.. ‘ధూమ్-3’, ‘పీకే’, ‘దంగల్’.. ఇలా వరుస విజయాలు నమోదు చేసుకుంటూ వస్తున్న ఆమిర్ ఖాన్.. ఇప్పుడు ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’తోనూ హిందీ చిత్రపరిశ్రమలో పలు సంచలనాలకు కేంద్ర బిందువు కాబోతున్నాడన్నమాట.

 READ MORE: మను టీజర్ 2 || ఫణింద్ర నరిశెట్టి |

(Visited 62 times, 1 visits today)

Related Post