టాలీవుడ్ లో శ్రీరస్తు శుభమస్తు మూవీతో హిట్ కొట్టి.. మలయాళంలోనూ తన హవాను కొనసాగించడానికి రెడీ అయిన ఈ అల్లు హీరో.. 1971 బెయాండ్ ద బోర్డర్స్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగులో ఈ మూవీ ‘1971 భారత సరిహద్దు’ పేరుతో రిలీజ్ కాబోతుంది. మరో వైపు ఈ చిత్ర టీజర్ ను కొద్ది నిమిషాల ముందే రిలీజ్ చేశారు. 

జనాతా గ్యారేజ్, మన్యం పులి చిత్రాలతో ఆకట్టుకున్న మోహన్ లాల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీలో అల్లు శిరీష్ యుద్ధ ట్యాంకర్‌ ఆపరేటర్‌గా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే మలయాళంలో ఈమూవీని ఏప్రిల్ 7 విడుదల చేస్తుండగా… తెలుగులో అదే రోజు మిగతా సినిమాలతో పోటీ ఎక్కువగా ఉండటంతో రిలీజ్ చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

1971 Bharatha Sarihaddu Movie Teaser | Mohanlal | Allu Sirish |
(Visited 393 times, 1 visits today)

Related Post