విడుదల తేదీ: మార్చ్ 10, 2017

దర్శకత్వం: కార్తీక న‌రేన్‌

నటీనటులు: ర‌హ‌మాన్‌, ప్ర‌కాష్ రాఘ‌వ‌న్‌, అశ్విన్ కుమార్‌, ప్ర‌దీప్‌, శ‌ర‌త్‌, ప్ర‌వీణ్‌,

నిర్మాత: చ‌ద‌ల‌వాడ పద్మావ‌తి

సంగీతం: జాక్సె బెజోయ్‌

గతేడాది బిచ్చగాడు సినిమాతో సెన్సేష‌న‌ల్ విజ‌యం అందుకున్న నిర్మాణ సంస్థ శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్. ఈ బ్యాన‌ర్ నుండి తెలుగులోకి అనువాద‌మైన సినిమా `16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్‌`. తమిళంలో సూపర్ సక్సెస్ సాధించిన ‘దురువంగల్ పదినారు’ తెలుగు లో మార్చి 10వ తారీఖున విడుదలయింది. 22 ఏళ్ళ యువ దర్శకుడు కార్తీక్ నరేన్ అతి తక్కువ కాలంలో తెరకెక్కించిన ఈ చిత్రం తమిళంలో గతేడాది డిసెంబర్ 29న విడుదలై ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. తమిళ్ లో అంతటి ఘన విజయం సాధించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మన తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో మన రివ్యూ లో చూద్దాం..

కథ :

దీపక్ అనే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పరిచయంతో సినిమా మొదలవుతుంది. దీపక్ దగ్గర కానిస్టేబుల్ గా పనిచేసిన వ్యక్తి ఫోన్ చేసి తన కొడుకు పోలీస్ ఆఫీసర్ కావాలని ఆశపడుతున్నాడు… పోలీస్ ఆఫీసర్ లైఫ్ ఎంత రిస్కీ గా ఉంటుందో తనకి చెప్పి తన మనసు మార్చమని రిక్వెస్ట్ చేస్తాడు. దీపక్ అందుకు ఒప్పుకుని అతనిని తన దగ్గరకు పంపమంటాడు. కొద్దిసేపట్లో ఒక యువకుడు దీపక్ దగ్గరకు వచ్చి అసలు పోలీస్ ఉద్యోగం ఎలా ఉంటుంది, పోలీస్ అంటే ఎలా ఉంటాడు అనేది తెలుసుకోవాలని ఉందని అడుగుతాడు. కానీ అప్పటికే ఒక కేసు విషయంలో తన కాలును కోల్పోయిన దీపక్ 5 ఏళ్ల క్రితం తను ఇన్వెస్టిగేషన్ చేసిన ఆ కేసును గురించి వివరించడం మొదలుపెడతాడు.

ఆ కేసులో ఒక యువకుడి హత్య, ఒక హిట్ అండ్ రన్, ఒక యువతి మిస్సింగ్ వంటి మూడు విడి విడి కేసులు కలిసి ఉంటాయి. ఆ మూడు కేసులను దీపక్ ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు ? అతని విచారణ ఎలాంటి మలుపులు తిరిగింది ? ఒక కేసుకు, ఇంకో కేసుకు సంబంధం ఏమిటి ? దీపక్ ఆ కేసులో నిజాన్ని ఎలా తెలుసుకున్నాడు ? చివరికి ఆ కేసుకి న్యాయం ఎలా జరిగింది ? అన్నది మిగిలిన కధ.

ఎలా ఉందంటే..?:

“భావోద్వేగం లో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలు ఎలా మారుతాయి” అనే థీమ్ తో తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఖచ్చితంగా ఇండియన్ సినిమా లో ఒక ఆణిముత్యంగా నిలిచిపోతుంది. దర్శకుడు కార్తిక్ నరేన్ ఆరంభం నుండి చివరి వరకు ప్రేక్షకుడికి తనంతట తానుగా అసలు నిజం ఏమిటో తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు. ఒకదాని తర్వాత ఒక ఆటంకం సృష్టిస్తూ ఊహకందని విధంగా సినిమాను నడిపాడు. దీంతో కథనం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ చాలా థ్రిల్లింగా అనిపిస్తుంది.

ఇక సినిమా ఫస్టాఫ్ మొత్తాన్ని ప్రస్తుతంలో పోలీస్ ఆఫీసర్ చేసే ఇన్వెస్టిగేషన్ తాలూకు సన్నివేశాలతో, వాళ్ళు తమ దృష్టి కోణంలో నేరాలు ఎలా జరిగుంటాయి అనే ఊహించే సన్నివేశాలతో ప్రేక్షకుడి తెలివికి కఠినమైన పరీక్ష పెడుతూ, ఎక్కడా తుది తీర్పును రివీల్ చేయకుండా బాగా నడిపాడు. అలాగే సెకండాఫ్ కు వచ్చే సరికి ఫస్టాఫ్ లో ప్రేక్షకులు సమాధానం అందుకోలేక ఓడిపోయిన ఒక్కొక్క ప్రశ్నకు ఊహకందని జవాబులు చాలా పక్కాగా చెబుతూ ఆశ్చర్యాన్ని కలిగించాడు.

చివరి క్లైమాక్స్ అయితే అబ్బో ఏమి తీర్పు అనేలా ఇచ్చాడు. ఒకేసారి ఒక పోలీస్ ఆఫీసర్ కర్తవ్య నిర్వహణ ఎలా ఉండాలి, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల పర్యవసానం ఏమిటి అనే అంశాల్లోనే కథ మొత్తానికి తీర్పు చెప్పడం బాగుంది. ఇక ప్రధాన పాత్ర చేసిన రహమాన్ నటన సినిమాకు కావాల్సినంత సీరియస్, సిన్సియర్ ఫీలింగ్ ను తీసుకొచ్చింది. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాల్లోని ఇంటెన్సిటీని చాలా బాగా క్యారీ చేశాయి.

సినిమా లోని కొన్ని లాజిక్స్ సామాన్య ప్రేక్షకుడికి అంత త్వరగా అర్ధంకావు. సినిమా మొదలైన దగగర్నుంచి ఇంటర్వెల్ పడే వరకు దర్శకుడు ప్రేక్షకుల మీదకి ప్రశ్నల మీద ప్రశ్నలు వదులుతూ సమాధానాలు కనుక్కోండి చూద్దాం అన్నట్టు ఉండే కథనం కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతుంది కానీ బి, సి తరగతుల ఆడియన్సుకు పెద్దగా నచ్చదు.

ఆకతాయి మూవీ రివ్యూ

సాంకేతిక వర్గం పని తీరు…?:

ఒక క్రైమ్ కథకు థ్రిల్లింగా ఉండే అల్లికలాంటి తెలివైన కథానాన్ని జోడించి ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేలా పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ ను రాసుకోవడంలో, దాన్ని అలాగే తెరకెక్కించడంలో కార్తిక్ నరేన్ ఒక దర్శకుడిగా, రచయితగా సక్సెస్ అయ్యాడు. ఇక సినిమా నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, జెక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉండి సినిమాకు నూటికి నూరు శాతం సహాయపడ్డాయి. క్లిష్టమైన ఈ చిత్ర కథనానికి శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ చాలా బాగా దోహదపడింది. శివరాం ప్రసాద్ గోగినేని అందించిన తెలుగు మాటలు, పాత్రల డబ్బింగ్ వాయిస్ చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయి.

నగరం మూవీ రివ్యూ

బలాలు:

  • కథ కథనాలు
  • డైరెక్షన్
  • కెమెరా వర్క్
  • బాక్గ్రౌండ్ మ్యూజిక్
  • స్క్రీన్ ప్లే
  • యాక్టర్స్ పెరఫార్మన్సెస్

చిత్రాంగద మూవీ రివ్యూ

బలహీనతలు:

  • సామాన్య ప్రేక్షకుడు అందుకోలేని లాజిక్స్

రేటింగ్:  3.25/5

(Visited 203 times, 1 visits today)

Related Post