ఇంట్లో దెయ్యం నాకేం భయం రివ్యూ మరియు రేటింగ్

రిలీజ్ డేట్: 30 డిసెంబర్ 2016

నటీనటులు: అల్లరి నరేష్, రాజేంద్ర ప్రసాద్, కృతిక, మౌర్యాని

డైరెక్టర్: జి. నాగేశ్వర రెడ్డి

ప్రొడ్యూసర్: బీవీఎస్ఎన్ ప్రసాద్

మ్యూజిక్: సాయి కార్తీక్

అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’. ఎప్పుడో నెల క్రితమే విడుదలవాల్సిన ఈ చిత్రం పలు కారణాల రీత్యా వాయిదాలు పడుతూ చివరకు ఈ రోజు డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చింది. గతంలో జి. నాగేశ్వర్ రెడ్డి, నరేష్ కాంబినేషన్లో వచ్చిన ‘సీమ శాస్త్రి, సీమ టపాకాయ్’ చిత్రాలు మంచి విజయాలుగా నిలవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడే చూద్దాం…

కధలోకి వెళ్తే: బ్యాండ్ మేళం ట్రూపుకి ఓనర్ అయిన నరేష్ (అల్లరి నరేష్), అతని ఫ్రెండ్స్ అయిన చమ్మక్ చంద్ర మరియు షకలక శంకర్ అనుకోకుండా ఒకరి సహాయం చేయాల్సి వచ్చి అప్పుల్లో ఇరుక్కుని డబ్బు కోసం ఒక ఇంట్లో ఉన్న దెయ్యాన్ని తరిమేస్తానని కాంట్రాక్ట్ కుదుర్చుకుని తన ఫ్రెండ్స్ తో ఆ ఇంటికి వెళ్తాడు నరేష్. ఆ ఇంట్లో ఏముంది అక్కడ ఎం జరిగింది అక్కడ నరేష్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? ఇంతకీ ఆ ఇంట్లో దెయ్యం ఉందా లేదా అనేదే ఈ సినిమా కథ.

ఎలా ఉందంటే..?: ఈ సినిమా లో ముందుగా చెప్పుకోవలసింది నరేష్ కామెడీ గురించి. చాలా కాలం నుండి నరేష్ లో మిస్సైన కామెడీ తరహా ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో దొరికిందనే చెప్పాలి. సినిమా ఫస్టాఫ్ నుండి ఎండింగ్ వరకు నడిచే కామెడీ ట్రాక్ చాలా చోట్ల మంచి నవ్వుల్ని పూయించింది. అతనికి తోడు షకలక శంకర్, చమ్మక్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్ ల కామెడీ కూడా బాగానే వర్కవుటైంది. ఫస్టాఫ్ అంతా వీళ్ళ కామెడీతోనే సాగుతూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది.

ఇక సెకండాఫ్ లో దెయ్యాన్ని ఎలివేట్ చేస్తూ తీసిన కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. కేవలం ప్రధాన పాత్రలనే కాకుండా ఇతర పాత్రలతో చేయించిన కామెడీ, హర్రర్ సన్నివేశాలు కొంత వరకు బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్లో వచ్చే చిన్నపాటి ట్విస్ట్ కూడా బాగుంది. ఇక నరేష్, కృతిక జయ కుమార్ ల లవ్ ట్రాక్ బాగుంది. కృతిక జయకుమార్ సినిమాలో చాలా అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. దెయ్యం పాత్ర పోషించిన సెకండ్ హీరోయిన్ మౌర్యాని నటన కూడా ఆకట్టుకుంది.

ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా మైనస్ పాయింట్స్ కొస్తే ఈ హర్ర కామెడీ జానర్ కు కావలసిన కామెడీ, హర్రర్ ఎంటర్టైన్మెంట్ ఉన్నా కథ చాలా రెగ్యులర్ గా ఉంది. అందులో కొత్తదనమేమీ కనబడలేదు. ఇంటర్వెల్ సమయంలో వచ్చే చిన్నపాటి ట్విస్ట్ మినహా సెకండాఫ్ లో జరగబోయే ప్రతి సన్నివేశాన్ని ముందుగానే ఊహించేంత రోటీన్ గా ఉన్నాయి. అలాగే కథలోని ప్రధాన పాత్రలను కాకుండా ఇతర ప్రతి పాత్రను దెయ్యంతో ఇంటరాక్ట్ చేయడం కొంత వరకు బాగానే ఉన్నా కాసేపటికి అనవసర సన్నివేశాలు ఎక్కువై బోర్ కొట్టించాయి. కథలో కీలకమైన దెయ్యం బ్యాక్ డ్రాప్ కూడా చాలా రొటీన్ గా, బలహీనంగా ఉండటంతో ఆ పాత్రతో కనెక్టవడం కష్టమైంది. దెయ్యానికి రెండు లక్ష్యాలు ఏర్పడటంతో ఏ ఒక్కదానికీ నూటికి నూరు శాతం న్యాయం జరక్క క్లైమాక్స్ కాస్త వెలితిగా అనిపించింది.

ఎవరెలా చేశారంటే..?: నరేష్ చాల కాలం తర్వాత తన కామెడీ స్టైల్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేశాడు హీరోయిన్స్ కృతిక, మౌర్యాని పెరఫామెన్స్ అండ్ డాన్స్ చాల బాగుంది, రాజేంద్ర ప్రసాద్ తన ఫేస్ ఎక్స్ప్రెషన్ తో బాగా ఎంటర్టైన్ చేశాడు. ఈ సినిమా కి సాయి కార్తీక్ మ్యూజిక్ హైలైట్ గా చేప్పొచ్చు. కొన్ని కొన్ని సీన్స్ టేకింగ్ చాల బాగున్నాయి.

బలాలు:

  • కామెడీ
  • హీరోయిన్ కృతిక
  • మ్యూజిక్
  • ఫస్ట్ హాఫ్

బలహీనతలు:

  • సెకండ్ హాఫ్
  • రొటీన్ స్టోరీ

రేటింగ్:  2.75/5

(Visited 53 times, 1 visits today)

Related Post